ఆఫ్రికాలో ఇండియన్ వ్లాగర్ మ్యాజిక్.. ముర్సి తెగ వారికి ‘పరదేశీ జానా నహీ’ నేర్పించి షాక్!

ప్రముఖ భారతీయ ట్రావెల్ వ్లాగర్ వినోద్ కుమార్( Vlogger Vinod Kumar ) చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.

ఆయన ఇథియోపియాలోని ముర్సి తెగ వాళ్లతో కలిసి రాత్రి క్యాంపింగ్ చేశారు.అంతేకాదు, వాళ్లకు ఏకంగా మన హిందీ పాట నేర్పించేశారు.

1996లో షారుఖ్ ఖాన్, కరీష్మా కపూర్ నటించిన సూపర్ హిట్ సినిమా 'రాజా హిందుస్తానీ' లోని 'పరదేశీ జానా నహీ' పాటను వినోద్ వాళ్లకు పాడి వినిపించారు.

బేలా సులాఖే, సురేష్ వాడ్కర్ ( Bela Sulakhe, Suresh Wadka )కలిసి పాడిన ఈ పాటను ముర్సి తెగ వాళ్లు కూడా ఆయనతో గొంతు కలిపి పాడటం విశేషం.

"""/" / వీడియోలో వినోద్ నేల మీద కూర్చొని ముందు ఒక డబ్బా పెట్టుకొని దాన్ని తడుతూ పాట పాడటం మొదలుపెట్టారు.

చుట్టూ ముర్సి తెగ సభ్యులు ఆసక్తిగా వింటూ ఆయనను ఫాలో అవుతూ పాట నేర్చుకున్నారు.

ఒక్కో లైన్ వినోద్ పాడితే వాళ్లు దాన్ని రిపీట్ చేస్తూ అలా కొన్ని లైన్లు నేర్చుకున్నారు.

వీడియో మొత్తం వాళ్లు వినోద్‌తో కలిసి పాడుతూ కనిపించారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు.

చాలామంది హార్ట్ ఎమోజీలతో తమ ప్రేమను కురిపించారు.'పరదేశీ జానా నహీ' తమ ఫేవరెట్ సాంగ్ అని చాలామంది కామెంట్స్ చేశారు.

అయితే కొందరు మాత్రం ఎప్పుడూ ఉండేలాగే జాత్యహంకారపు కామెంట్స్ చేశారు.ముర్సి తెగ వాళ్ల స్కిన్ కలర్ గురించి దారుణంగా మాట్లాడారు.

"""/" / వినోద్ కుమార్ ట్రావెల్ వ్లాగర్ అని చాలా మందికి తెలుసు.

ఇన్‌స్టా, యూట్యూబ్‌లో ఆయనకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే.ఇన్‌స్టాలో 1.

2 లక్షల మంది ఫాలోవర్లు, యూట్యూబ్‌లో దాదాపు 1.9 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

ఆయన ఎక్కువగా ట్రావెల్ వీడియోలే చేస్తుంటారు.ఇప్పుడు ఆఫ్రికా ట్రిప్‌కు సంబంధించిన వీడియోలు పెడుతున్నారు.

ఏదేమైనా, భాషలు వేరైనా సంగీతం అందరినీ కలుపుతుందని ఈ వీడియో మరోసారి నిరూపించింది.

ఎవరూ ఊహించని ఈ కల్చరల్ మిక్స్‌ను నెటిజన్లు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఒకే దారిలో నడుస్తున్న అల్లు అర్జున్, ఎన్టీఆర్.. ఇద్దరు హీరోలకు సక్సెస్ దక్కుతుందా?