భారత జట్టు 4-1 తేడాతో టీ20 సిరీస్ కైవసం.. ఓటమిపై స్పందించిన ఆసీస్ కెప్టెన్..!
TeluguStop.com
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా ఆదివారం జరిగిన చివరి టీ20 మ్యాచ్లో భారత జట్టు ఆరు పరుగుల తేడాతో విజయం సాధించి, 4-1 తేడాతో టైటిల్ కైవసం చేసుకుంది.
"""/" /
భారత జట్టు సూర్య కుమార్( Surya Kumar Yadav ) యాదవ్ కెప్టెన్సీలో తొలి టీ20 సీరీస్ గెలిచింది.
భారత జట్టు ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ సిరీస్ లో మొదటి నాలుగు మ్యాచ్లలో అద్భుత ఆటను ప్రదర్శించాడు.
ఇక చివరి మ్యాచ్లో కేవలం పది పరుగులకే పెవీలియన్ చేరాడు.ఈ సిరీస్ లో ఐదు మ్యాచ్లలో కలిపి మొత్తం 223 పరుగులు చేశాడు.
దీంతో ఓ టీ20 ద్వైపాక్షిక సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా రుతురాజ్ ( Ruturaj Gaikwad )రికార్డ్ సృష్టించాడు.
ఓవరాల్ గా కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ తర్వాత ఒకే సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన మూడవ భారత ఆటగాడిగా రుతురాజ్ నిలిచాడు.
"""/" /
ఇక ఈ టీ20 సిరీస్ విషయానికి వస్తే.చివరి మ్యాచ్ అనంతరం ఓటమి పై ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ మాథ్యూ వేడ్( Matthew Wade ) స్పందించాడు.
ఈ సిరీస్ ను 3-2 తో ముగించాలని అనుకున్నట్లు తెలిపాడు.అందుకోసం మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో తమ జట్టు బౌలర్లు అద్భుతంగా రాణించాలని తెలిపాడు.
ఇక తమ జట్టు బ్యాటింగ్ విషయానికి వస్తే చివరి ఐదారు ఓవర్లు అనుకున్న రీతిలో రాణించక పోవడమే ఓటమికి కారణం అని తెలిపాడు.
తమ జట్టు కొన్ని తప్పిదాలు చేసిందని, ఈ సిరీస్ తమకు ఒక గుణపాఠం అని, టీ20 ప్రపంచ కప్ కోసం ఎదురుచూస్తున్నానని ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ మాథ్యూ వేడ్ వివరించాడు.
గేమ్ చేంజర్ మూవీ గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పిన సెన్సార్ బోర్డు మెంబర్స్…ఆ రెండు సీన్లు ఫ్యాన్స్ కి కిక్కు ఇవ్వబోతున్నాయా..?