యూఏఈలో భారతీయ టీచర్‌కు లాటరీలో జాక్‌పాట్

యూఏఈలో భారతీయ టీచర్‌కు లాటరీలో జాక్‌పాట్

అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో తెలియదు.చేతిలో ఆ రేఖ ఉన్న వారిని కొంచెం ఆలస్యమైనా అదృష్టలక్ష్మీ వెతుక్కుంటూ వస్తుంది.

యూఏఈలో భారతీయ టీచర్‌కు లాటరీలో జాక్‌పాట్

యూఏఈలోని భారతీయ మహిళ విషయంలో ఇది అక్షరాల నిజమైంది.వివరాల్లోకి వెళితే.

యూఏఈలో భారతీయ టీచర్‌కు లాటరీలో జాక్‌పాట్

అజ్మన్‌కు చెందిన మాలతీ దాస్ స్థానిక భారతీయ హైస్కూల్‌‌లో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు.ఈమెకు ఇటీవల నిర్వహించిన డ్రాలో 10 లక్షల అమెరికన్ డాలర్ల లాటరీ తగిలింది.

లాటరీ టికెట్లు కొనే అలవాటున్న ఆమె గత కొన్నేళ్ల నుంచి లక్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తోంది.

ఆ క్రమంలో మాలతీ గత నెల 26న ఆన్‌లైన్ ద్వారా లాటరీ టికెట్ కొనుగోలు చేశారు.

బుధవారం దుబాయ్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని టెర్మినల్‌2లో లాటరీ డ్రా నిర్వహించారు.ఈ డ్రాలో ఆమెకు 10 లక్షల డాలర్ల బంపర్ ప్రైజ్ తగిలింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇది గొప్ప వరమని, ఈ డబ్బును మంచి పనులకు ఉపయోగిస్తానని ఆమె పేర్కొన్నట్లు గల్ఫ్ న్యూస్ కథనాన్ని తెలిపింది.

అలాగే తాను ప్రస్తుతం పనిచేస్తున్న స్కూలు అభివృద్దికి కొంత మొత్తాన్ని వినియోగిస్తానని మాలతీ చెప్పారు.

"""/"/ 1999లో ఈ లాటరీలు మొదలుపెట్టినప్పటి నుంచి 10 లక్షల డాలర్లు గెలుచుకున్న భారతీయులలో మాలతీ దాస్ 165వ వ్యక్తని లాటరీ నిర్వాహకులు తెలిపారు.

దాస్‌కు ముందు యూఏఈలో నివసిస్తున్న భారతీయుడు డిక్సన్ కట్టిహర అబ్రహం గత నెలలో జరిగిన లాటరీ డ్రాలో ఒక కోటి దీనార్ల ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు.

అలాగే ఏప్రిల్‌లో జరిగిన డ్రాలో ఓ భారతీయ డ్రైవర్ కోటి 20 లక్షల దీనార్ల లాటరీని కొట్టేసిన సంగతి తెలిసిందే.

ఉగాది పండుగ ఎందుకు జ‌రుపుకుంటారు.. ఉగాది ప‌చ్చ‌డి తిన‌డం వ‌ల్ల లాభాలేంటి?

ఉగాది పండుగ ఎందుకు జ‌రుపుకుంటారు.. ఉగాది ప‌చ్చ‌డి తిన‌డం వ‌ల్ల లాభాలేంటి?