మా శ్రమను చౌకగా దోపిడీ చేస్తోంది… కెనడాపై భారతీయ విద్యార్ధుల ఆరోపణలు

కెనడాపై సంచలన వ్యాఖ్యలు చేశారు అక్కడికి వెళ్లిన కొందరు భారతీయ విద్యార్ధులు.ఆ దేశం తమను చౌకైన శ్రమ వనరుగా ఉపయోగించుకుంటోందని వారు వ్యాఖ్యానించారు.

అవసరం లేనప్పుడు తమను విస్మరిస్తున్నారని భారతీయ విద్యార్ధులు అన్నట్లుగా మంగళవారం మీడియాలో కథనాలు వచ్చాయి.

కెనడాలో కార్మికుల కొరత, అధిక నిరుద్యోగిత రేటు.ఈ ఏడాది సెప్టెంబర్‌లో 5.

2 శాతానికి పడిపోయిన నేపథ్యంలో ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రేజర్ తాత్కాలిక చర్యలు చేపట్టినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపింది.

దీని ప్రకారం.జస్టిన్ ట్రూడో ప్రభుత్వం కెనడాలో ఇప్పటికే వున్న 5,00,000 మంది అంతర్జాతీయ విద్యార్ధులకు ఎక్కువ గంటలు పనిచేయడానికి, గ్రాడ్యుయేషన్ తర్వాత 18 నెలల పాటు ఉద్యోగాన్ని పొందేందుకు అనుమతులను పొడిగించిన సంగతి తెలిసిందే.

అయితే ఏడాది కంటే ఎక్కువకాలం గడిచిన తర్వాత.శాశ్వత నివాస హోదా ఆశిస్తున్న వారిలో కొందరు పనిచేయడానికి, దేశంలోనే ఉండేందుకు హోదాను కోల్పోయారు.

కెనడాలో 1.83 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు.

తద్వారా భారతీయులకు కెనడా రెండవ గమ్యస్థానంగా నిలిచింది.అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 4.

52 లక్షలకు పైగా స్టడీ పర్మిట్ దరఖాస్తులను ప్రాసెస్ చేసింది.గతేడాది ఇదే సమయంలో వీటి సంఖ్య 3.

67 లక్షలు మాత్రమేనని , ఇది ఇప్పుడు 23 శాతం పెరిగిందని ఇమ్మిగ్రేషన్ మంత్రి తెలిపారు.

2021 ప్రోగ్రామ్‌లో భాగంగా కెనడాకు వచ్చిన గ్రాడ్యుయేట్‌లు, వారి వర్క్ పర్మిట్‌ల గడువు ముగిసినప్పుడు.

శాశ్వత నివాసం పొందుతారనే హామీ లేక తమ ఉద్యోగాలను వదిలివేయాల్సి వచ్చింది.వీరి దరఖాస్తులు చివరికి విజయవంతంగా ప్రాసెస్ జరిగినప్పటికీ.

విద్యార్ధులు ఉద్యోగం, ఆదాయం, సామాజిక ప్రయోజనాలు లేక నెలల తరబడి నిస్సహాయంగా గడుపుతున్నారు.

వాళ్లకు అవసరమైనప్పుడు వారు మమ్మల్ని దోపిడీ చేశారని.కానీ మాకు వారి సహాయం కావాల్సి వున్నప్పుడు.

ఎవరూ కనిపించరని అన్ష్‌దీప్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. """/"/ ప్రభుత్వ డేటా ప్రకారం.

అంతర్జాతీయ విద్యార్ధులు కెనడియన్ ఆర్ధిక వ్యవస్ధకు ఏటా 21 బిలియన్ డాలర్లకు పైగా అందజేస్తున్నారు.

నాణ్యమైన విద్య, ఫ్రెండ్లీ వీసా, ఇమ్మిగ్రేషన్ నియమాలు, మెరుగైన ఉపాధి అవకాశాల కారణంగా విదేశీ విద్యార్ధులకు కెనడా డెస్టినేషన్‌గా మారింది.

చాలా మంది భారతీయ విద్యార్ధులు తమ చదువుపూర్తయిన తర్వాత కెనడాలో శాశ్వత నివాసులుగా వుండేందుకు ఆసక్తి చూపుతున్నారు.

భారత విదేశాంగ శాఖ డేటా ప్రకారం.2022 మొదటి ఆరు నెలల్లో విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయుల్లో 64,667 మంది తొలి గమ్యస్థానం అమెరికా కాగా.

60,258 మందితో కెనడా రెండవ స్థానంలో వుంది.కోవిడ్‌కు ముందు 2019లో 1,32,620 మంది భారతీయ విద్యార్ధులు కెనడాను ఎంచుకున్నారు.

తర్వాత 2020లో దీని సంఖ్య 43,624కి, 2021లో స్వల్పంగా పెరిగి 1,02,688కి చేరుకుంది.

2024లో భారత్‌లోని యూఎస్ ఎంబసీ ఎన్ని వీసాలను జారీ చేసిందంటే?