బ్రిటన్ వీసాల వైపు భారతీయ విద్యార్ధుల మొగ్గు...త్వరలో ప్రత్యక్ష బోధన...!!!

కరోనా సమయంలో అన్ని దేశాలు వలస వాసులకు తమ దేశంలోకి ప్రవేశం లేదంటూ నో ఎంట్రీ బోర్డులు పెట్టేశాయి.

కరోనా తగ్గిన తరువాత మాత్రమే మిగిలిన విషయాలు ఆలోచిద్దాం అంటూ ఆంక్షలు కూడా విధించింది.

ఈ నేపథ్యంలో అమెరికా వంటి దేశాలకు భారత్ నుంచీ అత్యధికంగా వలసలు వెళ్ళే విద్యార్ధుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

కరోనా కేసులు మెల్లగా తగ్గుముఖం పడుతున్న తరుణంలో అప్పటికి అమెరికా ఇంకా ఆంక్షలు సడలించలేదు.

ఈ పరిస్థితులను క్యాష్ చేసుకునేందుకు, భారతీయ విద్యార్ధులను తమ దేశంలోకి ఆకర్షించే క్రమంలో.

వీసా నిబంధనల్లో భారీ మార్పు తీసుకువచ్చింది.ఈ ఫలితంగా భారత్ నుంచీ లెక్కకు మించి విద్యార్ధులు బ్రిటన్ వీసా తీసుకుని ఎంచక్కా చెక్కేశారు.

అయితే మరింత మంది విద్యార్ధులను ఆకర్షించే క్రమంలో బ్రిటన్ తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది.

ఇకపై అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచీ బ్రిటన్ లో విద్యార్ధులు అందరికి ప్రత్యక్ష బోధనా ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించింది.

ఈ మేరకు ప్రభుత్వం నుంచీ అనుమతులు తీసుకోనున్నారని సమాచారం.ఈ విషయాన్ని బ్రిటిష్ కౌన్సిల్ దక్షిణ భారత సంచాలకులు జనక పుష్పనాద్ తెలిపారు.

కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో భారత్ నుంచీ వెళ్ళే వారి సంఖ్య అత్యధికంగా ఉంటోందని ఆమె తెలిపారు.

వీసాల నిబంధనలలో మార్పులు తీసుకురావడంతో గడిచిన రెండేళ్ళ కాలంలో సుమారు 197 శాతం మంది వెళ్ళారని ఆమె తెలిపారు.

2019 ఏడాదిలో 30,500 మంది , 2020 లో 45,670 మంది , అలాగే 2021 లో 90,699 మంది చేరారట.

ఇదిలాఉంటే త్వరలో అంటే జనవరి 4 వ తేదీన బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో బ్రిటన్ లో ఆన్లైన్ మేళా జరుగుతుందని, ఈ మేళా లో విద్యావకాశాలపై అవగాహన కార్యక్రమం ఉంటుందని ఆమె ప్రకటించారు.

డీకే తుపాన్‌ ఇన్నింగ్స్‌లు.. టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో ఛాన్స్‌ కోసమేనా..?!