అమెరికా : ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. యూనివర్సిటీలలో భారతీయ విద్యార్ధుల్లో అనిశ్చితి

ఇజ్రాయెల్ - పాలస్తీనా యుద్ధం అగ్రరాజ్యానికి ఇబ్బందులను తెచ్చిపెడుతోంది.ఇజ్రాయెల్‌కు( Israel ) మద్ధతుగా కొందరు, పాలస్తీనాకు( Palestine ) మద్ధతుగా మరికొందరు ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

ఇవి కొన్నిచోట్ల హింసాత్మంగా మారి శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి.యేల్, కొలంబియా, న్యూయార్క్ యూనివర్సిటీలు సహా అనేక విశ్వవిద్యాలయాలలో ఇజ్రాయెల్ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి.

ఈ నిరసనల్లో అనేక దేశాలకు చెందిన విద్యార్ధులు , యువత పాల్గొంటున్నారు.దీంతో పెద్ద సంఖ్యలో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

అయితే యూనివర్సిటీలలో కొనసాగుతోన్న నిరసనల కారణంగా అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్ధుల్లో( Indian Students ) ఆందోళన, అనిశ్చితి అలముకుంది.

అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులలో చైనీయుల తర్వాత భారతీయులే అతిపెద్ద సమూహం. """/" / నిరసనల కారణంగా సస్పెన్షన్, అరెస్ట్, క్రమశిక్షణా చర్యలను ఎదుర్కొంటున్న తోటి సహచరులను మన విద్యార్ధులు చూస్తున్నారు.

వీటిలో పొరపాటున పాల్గొంటే వీసా రద్దు, బహిష్కరణ వంటి ముప్పు కూడా వుంటుందని వారు భయపడుతున్నారు.

భారతీయ విద్యార్ధులు యూనివర్సిటీల నుంచి అందే రుణం, ఇతర ఆర్ధిక సహాయాలపై ఆధారపడినందున వారు నిరసనలకు దూరంగానే వుంటున్నారు.

అయినప్పటికీ తర్వాత జరిగే పరిణామాలను గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.విద్యార్ధులే కాదు.

అమెరికా విశ్వవిద్యాలయాల్లో( US Universities ) పనిచేస్తున్న భారతీయ ఫ్యాకల్టీ సభ్యులు కూడా ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

"""/" / కాగా.కొద్దిరోజుల క్రితం ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న ఓ భారత సంతతి విద్యార్ధినిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో చదువుతున్న అచింత్య శివలింగన్‌ను( Achinthya Sivalingan ) అరెస్ట్ చేయడంతో పాటు క్యాంపస్ నుంచి కూడా నిషేధించారు.

గత నెలలో మెక్‌కోష్ కోర్డ్‌యార్డులో కొందరు విద్యార్ధులు పాలస్తీనా అనుకూల నిరసనల కోసం శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

"""/" / యూనివర్సిటీ అధికారులు దీనిని తీవ్రంగా పరిగణించడంతో పాటు ఇద్దరు విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నారు.

వీరిలో ఒకరు జీఎస్ అచింత్య శివలింగం , మరొకరు హసన్ సయ్యద్ జీఎస్ .

కళాశాలలు ఇజ్రాయెల్‌తో తమ ఆర్ధిక సంబంధాలను తెంచుకోవాలని విద్యార్ధులు డిమాండ్ చేశారు.కొందరు యూదు విద్యార్ధులు.

నిరసనలు ఇప్పుడు సెమిటిజంగా మారాయని, తాము క్యాంపస్‌లోకి రావాలంటేనే భయంగా వుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ సినిమా తర్వాత ప్రభాస్ కు అభిమానిగా మారా.. శ్రేయస్ అయ్యర్ కామెంట్స్ వైరల్!