ఆర్ధిక మాంద్యం ఎఫెక్ట్ : యూఎస్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్‌ల కోసం భారతీయ విద్యార్ధుల పోరాటం

అమెరికాలో( America ) చదువుతున్న భారతీయ విద్యార్ధులు ఈ వేసవిలో ఇంటర్న్‌షిప్‌లను( Summer Internships ) పొందడంలో తీవ్ర అడ్డంకులను ఎదుర్కొంటున్నారు.

దేశవ్యాప్తంగా జాబ్ మార్కెట్ విస్తరణలో గణనీయమైన క్షీణత వుందని విశ్లేషకులు అంటున్నారు.విపరీతమైనప పోటీ కారణంగా .

జాబ్ ల్యాండ్‌స్కేప్‌ను ఎదుర్కోవడానికి, దానికి ముందు ఆచరణాత్మక అనుభవాన్ని పొందడానికి ఇంటర్న్‌షిప్‌లు అవసరం.

అయినప్పటికీ ఎంతోమంది విద్యార్ధులు ఐవీ లీగ్ సంస్థలలో( Ivy League Universities ) రిజిస్టర్ చేసుకున్న వారితో సహా ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను పొందడం సవాల్‌గా మారింది.

ప్రబలంగా వున్న ఆర్ధిక మాంద్యం .ఎంట్రీ లెవల్ ఉద్యోగ అవకాశాల క్షీణతకు దారితీసింది.

అమెరికాలో నివసిస్తున్న అనేక మంది విద్యార్ధులు, అకడమిక్ కన్సల్టెంట్లు, భారతీయ అమెరికన్ నిపుణులు ఈ పరిస్ధితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు( US Presidential Elections ) జరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు స్థానిక విద్యార్ధులను నియమించుకోవడానికి ప్రాధాన్యతనిస్తూ ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నాయి.

దీనికి తోడు పెరిగిన ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన వ్యయాలు, స్థానిక నిరుద్యోగ రేట్లు , స్పాన్సర్‌షిప్ సంక్లిష్టత వంటి అంశాలు ఈ ఏడాది అమెరికాలో తమ చదువులు పూర్తి చేయడానికి భారతీయ విద్యార్ధులు( Indian Students ) ఎదుర్కొంటున్న ఇబ్బందులను మరింత పెంచాయి.

"""/" / ‘‘ కాలేజీఫై ’’( Collegify ) అనే ఎడ్యుకేషన్ కన్సల్టింగ్ సంస్థ కో ఫౌండర్ ఆదర్శ్ ఖండేల్వాల్ .

( Adarsh Khandelwal ) ఎకనమిక్ టైమ్స్‌తో మాట్లాడుతూ తాను ఈస్ట్ కోస్ట్ , వెస్ట్ కోస్ట్‌లోని ఐవీ లీగ్‌ల నుంచి సుమారు 400 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులకు కౌన్సెలింగ్ ఇచ్చానని తెలిపారు.

ఈశాన్య అమెరికాలో వున్న 8 ప్రతిష్టాత్మక ప్రైవేట్ యూనివర్సిటీలను ఐవీ లీగ్ కలిగి వుందని ఆదర్శ్ చెప్పారు.

"""/" / ఎన్‌వైయూ స్టెర్న్, యూఎస్ బర్కిలీ, బ్రౌన్ యూనివర్సిటీ, పెన్సిల్వేనియా యూనివర్సిటీ వంటి విద్యాసంస్థలలో చేరిన భారతీయ విద్యార్ధులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వెల్లడించారు.

ఈ విద్యార్ధులలో చాలా మంది భారత్‌లో ప్లేస్‌మెంట్‌లను పొందేందుకు తమను సంప్రదిస్తున్నారని ఆదర్శ్ చెప్పారు.

అధిక డిమాండ్ వున్న సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ , మ్యాథమెటిక్స్( STEM ) రంగాలలో నైపుణ్యం కలిగిన విద్యార్ధులు కూడా ఈ తరహా అడ్డంకులు ఎదుర్కొంటున్నారని నిపుణులు తెలిపారు.

అదే వైసీపీ అసలు ధీమానా ?