కెనడాలో భారతీయ విద్యార్థుల నిజ స్వరూపం ఇదేనా.. వీడియో వైరల్!
TeluguStop.com
ప్రస్తుతం కెనడా దేశం,( Canada ) అంటారియో ప్రావిన్స్‌లోని H3 Class=subheader-styleసాల్ట్ స్టే.
మేరీ/h3p( Sault Ste Marie ) ప్రాంత ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది.ఒకప్పుడు స్నో వైట్ అందాలతో ఆకట్టుకున్న ఈ నైబర్‌హుడ్ ఇప్పుడు చెత్త కుప్పలతో( Garbage ) నిండిపోయింది.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జనం మండిపడుతున్నారు."ఛీ.
ఎంత దారుణంగా ఉంది" అంటూ తిట్టిపోస్తున్నారు.ఈ చెత్తకు కొందరు భారతీయ స్టూడెంట్సే( Indian Students ) కారణమంటూ ఆరోపణలు వస్తున్నాయి.
టిక్‌టాక్, X (ట్విట్టర్)లో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది.అందులో చెత్తతో నిండిన వీధులు, భారత జెండా, ఒక ఎమోజీ, ఇంకా "ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇల్లీగల్‌గా చెత్త పడేస్తున్నారు" అని ఉంది.
దీంతో దుమారం రేగింది.వీడియో తీస్తున్న వ్యక్తి ఎమోషనల్‌గా మాట్లాడుతూ "ఇది నేను పుట్టి పెరిగిన ఊరు.
ఒకప్పుడు ఎంత కళగా ఉండేదో! బతకడానికి స్వర్గంలా ఉండేది." అని అన్నాడు.
ఈ వీడియోలో నల్లటి చెత్త సంచుల కుప్పలు, వాటి పక్కనే తిరుగుతున్న ఎలుకని మనం చూడవచ్చు.
ఆ వ్యక్తి ఇంకా మాట్లాడుతూ "ఇదంతా డైవర్సిటీ పుణ్యమా అని వచ్చింది.ఛీ.
చూడటానికి అసహ్యంగా ఉంది." అని అన్నాడు.
ఈ మాటలతో మరింత రచ్చ మొదలైంది. """/" /
ఈ వీడియో సోషల్ మీడియాలో తుఫానులా దూసుకుపోయింది.
కొందరు ఆ వ్యక్తి మాటలకు జై కొట్టారు.మరికొందరు మాత్రం అంతర్జాతీయ విద్యార్థుల్ని( International Students ) నిందించడం తప్పు అని అతన్ని ఏకిపారేశారు.
ఒక నెటిజన్ "వాళ్లు ఇంటర్నేషనల్ స్టూడెంట్సే అని కచ్చితంగా ఎలా చెప్తాం? కొందరు ఉండొచ్చు.
కానీ ఎలాంటి ఆధారం లేకుండా అందరినీ నిందించడం కరెక్ట్ కాదు.చలికి ఇబ్బంది పడుతున్న వాళ్లెవరైనా ఇలా చేసి ఉండొచ్చు.
ఏదేమైనా.ఈ పరిస్థితి చాలా బాధాకరం.
" అని కామెంట్ చేశాడు. """/" /
"ఇదేదో ఒక్క చోటే కాదు, ఎక్కడ చూసినా ఇదే తంతు," అని ఇంకొకరు కామెంట్ చేశారు.
"మా పక్కింటివాళ్లు ఇల్లు అమ్మేశారు.ఇప్పుడు అక్కడ పదిమంది స్టూడెంట్స్ ఉంటున్నారు.
ఇల్లంతా చిందరవందరగా ఉంది." అని ఇంకొకరు అన్నారు.
కొందరైతే మరీ రెచ్చిపోయారు." భారతీయ విద్యార్థుల నిజస్వరూపం ఇదే, వాళ్లందర్నీ వెనక్కి తరిమేయండి" అంటూ శాపనార్థాలు పెట్టారు.
ఇంకొందరు ఆ ప్రాంతమంతా "స్లమ్" అయిపోయిందని, ఒకప్పటి అందం మాయమైపోయిందని తెగ బాధపడిపోయారు.
ఇదిలా ఉండగా, కెనడా ఇమ్మిగ్రేషన్ రూల్స్‌ని మార్చే పనిలో ఉంది.ఈ గొడవ జరుగుతున్న టైమ్‌లోనే ఈ మార్పులు రావడం గమనార్హం.
కొత్త రూల్స్ వస్తే, ముఖ్యంగా ఇండియా నుంచి వెళ్లేవాళ్లపై గట్టి దెబ్బ పడే అవకాశం ఉంది.
శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీపై వరుస విమర్శలు.. ఇంత నెగిటివిటీకి కారణాలివేనా?