విదేశాల్లో ఉన్నత విద్య : యూకేలో మాస్టర్స్ వద్దంటోన్న భారతీయ విద్యార్ధులు, కారణమిదేనా..?

భారతీయ విద్యార్ధులు( Indian Students ) ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లడం ఈ మధ్యకాలంలో పెరిగిన సంగతి తెలిసిందే.

మన పిల్లల ఫేవరెట్ డెస్టినేషన్‌లలో యూకే( UK ) ఒకటి.కానీ అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల నేపథ్యంలో భారతీయ విద్యార్ధులు యూకే వైపు మొగ్గుచూపడం తగ్గుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.

లండన్‌లో గురువారం వెల్లడైన ఓ నివేదిక ప్రకారం గతేడాది కంటే 21 వేల మందికి పైగా తక్కువగా భారతీయ విద్యార్ధులు మాస్టర్స్ డిగ్రీ( Master's Degree ) కోసం నమోదు చేసుకున్నారు.

ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ఓఎన్ఎస్)( Office For National Statistics ) గణాంకాల ఆధారంగా యూకే హోమ్ ఆఫీస్ డేటా ప్రకారం డిసెంబర్ 2023తో ముగిసిన సంవత్సరంలో భారతీయ విద్యార్ధి దరఖాస్తుదారులలో 16 శాతం తగ్గుదల నమోదైంది.

ఇది 2022తో పోలిస్తే 10 శాతం తగ్గింది.జూలై 4న జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వలసలను అరికట్టడాన్ని తన ముఖ్య ప్రణాళికలలో ఒకటిగా చేసుకున్న బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్‌కు( British Prime Minister Rishi Sunak ) ఈ గణాంకాలు గొప్ప ఊరటగా చెప్పవచ్చు.

కానీ ఇవి విదేశీ విద్యార్ధుల ఫీజులపై ఆధారపడి నడిచే యూకే యూనివర్సిటీలను మాత్రం ఆందోళనకు గురిచేస్తున్నాయి.

"""/" / మార్చి 2024తో ముగిసే సంవత్సరంలో భారతీయ దరఖాస్తుదారులకు 1,16,455 స్పాన్సర్డ్ స్టడీ వీసా గ్రాంట్లు వున్నాయి.

ఇవి మునుపటి ఏడాది కంటే 21,717 తక్కువని హోం ఆఫీస్ పేర్కొంది.భారతీయ విద్యార్ధుల్లో అత్యధికులు (94,149 మంది లేదా 81 శాతం) మాస్టర్స్ చదవడానికి యూకేకు వస్తారని .

కానీ ఈసారి 21,800 మంది తగ్గారని తెలిపింది. """/" / ఈ ఏడాది ప్రారంభం నుంచి విద్యార్ధులు, వారి కుటుంబంపై ఆధారపడిన వ్యక్తులు, వారి జీవిత భాగస్వాములు, పిల్లలను తీసుకురావడంపై కఠిన నిబంధనలు అమల్లోకి రావడంతో విద్యార్ధుల సంఖ్య తగ్గినట్లుగా తెలుస్తోంది.

దీనికి గ్రాడ్యుయేట్ రూట్ స్టడీ స్కీమ్‌ను( Graduate Route Study Scheme ) రద్దు చేయడమో, పరిమితులు విధించడమో చేయాలని రిషి సునాక్ భావిస్తుండటం కూడా విద్యార్ధుల రాకపై ప్రభావం చూపింది.

ఈ ఏడాది మార్చి నుంచి ఈ వీసా రూట్ ద్వారా లబ్ధి పొందిన విదేశీ విద్యార్ధుల్లో భారతీయులు (64,372) అగ్రస్థానంలో ఉన్నారు.

గురువారం నాటి డేటా.‘‘ న్యూ ఇండియ యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ ’’ వివరాలను కూడా వెల్లడించింది.

ఇది యువకులకు ఏడాదికి 3 వేల వీసాలను అందిస్తుండగా.ఈ ఏడాది మార్చి నాటికి దాదాపు 2,105 మంది భారతీయ విద్యార్ధులకు గ్రాంట్‌ను అందించింది.

అప్పట్లో చైతన్యకు సమంత ఎంత రేటింగ్ ఇచ్చిందో మీకు తెలుసా.. ఎన్టీఆర్ కంటే ఎక్కువంటూ?