తైవాన్ లో “తెలుగు ఎన్నారై” అనుమానాస్పద మృతి

ఉన్నతమైన చదువు చదివి.ఆ చదువుకి తగ్గట్టుగా మంచి ఉద్యోగం సంపాదించి తన తల్లి, తండ్రులకి, భార్యకి మంచి భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఒక యువకుడు కన్న కలలు ఆవిరి అయ్యిపోయాయి .

అతడి మరణం ఆ కుటుంబానికి తీరని లోటుని మిగిల్చింది.అతడి మరణ వార్త ఆ కుటుంభంలో పుట్టెడు శోఖాన్ని మిగిల్చింది.

వివరాలలోకి వెళ్తే.బద్వేలు పట్టణంలోని శాస్త్రి నగర్ లో ఉండే జిందేషా సాహెబ్‌కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

వారిలో మూడో వాడైన షేక్‌ మహమ్మద్‌ అరాఫత్‌(34) అనంతపురంలోని ఎస్‌కే యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు.

ఏడాది నుంచి తైవాన్‌లోని చో యాంగ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీస్‌లో పోస్ట్‌ డాక్టర్‌ ఫెలో రీసెర్చ్‌గా ఉంటున్నాడు.

అయితే ప్రతీ రోజు కుటుంభ సభ్యులతో మాట్లాడే అతడు ఎప్పటిలాగానే Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ కుటుంభ సభ్యులకి ఫోన్ చేసి రంజాన్‌ మాసం కావడంతో ఇంటికి వస్తున్నానని తెలిపాడు.

అయితే ఇంతలో ఏమి జరిగిందో ఏమో కానీ కానీ తైవాన్‌లోని ఇండియన్‌ ఎంబసీ నుంచి అక్కడి అధికారులు బద్వేలులోని అరాఫత్‌ సోదరునికి ఫోన్‌ చేశారు.

అరాఫత్‌ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయాన్ని తెలిపారు దాంతో ఒక్కసారిగా కుటుంభ సభ్యులు షాక్ కి లోనయ్యారు.

అయితే అతడికి ప్రొద్దుటూరుకు చెందిన బీబి అయీషాతో మూడేళ్ల క్రితం పెళ్లి అయ్యింది కాగా 10 నెలల బాబు కూడా ఉన్నాడు అయితే అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు.

అది ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది.

మృతుడి కుటుంభ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న డాకు మహారాజ్.. మూవీ స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడేనా?