లైబ్రరీకి వెళ్లినవాడు.. కాలువలో శవంగా, యూకేలో భారతీయ విద్యార్ధి అనుమానాస్పద మృతి

యూకేలో( UK ) విషాదం చోటు చేసుకుంది.కాలువ సమీపంలో ఓ భారతీయ విద్యార్ధి( Indian Student ) అనుమానాస్పద స్థితిలో శవమై తేలాడు.

వివరాల్లోకి వెళితే.తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన జీవంత్ శివకుమార్ (25)( Jheevanth Sivakumar ) అనే విద్యార్ధిని స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 4.

30 గంటలకు సెల్లీ ఓక్‌లోని మ్యాట్రాన్స్ వాక్ వద్ద వోర్సెస్టర్ అండ్ బకింగ్‌హామ్ కాలువ( Worcester And Birmingham Canal ) నుంచి ప్రాణాపాయ స్థితిలో వుండగా బయటకు తీశారు.

అనంతరం 4.46 గంటలకు వైద్య సిబ్బంది అప్పటికే సిద్ధంగా వుంచిన అంబులెన్స్‌‌లో శివకుమార్‌కు అధునాతన లైఫ్ సపోర్ట్ అందించి అతని ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించారు.

కానీ శివకుమార్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.శివకుమార్ బర్మింగ్‌హామ్‌లోని ఆస్టన్ యూనివర్సిటీలో( Aston University ) వన్ ఇయర్ ఫుల్ టైమ్ స్ట్రాటజీ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్‌లో ఎమ్మెస్సీ చదువుతున్నాడు.

ఉన్నత చదువుల నిమిత్తం అతను 2022 సెప్టెంబర్‌లో యూకేకు వచ్చాడు.గతంలో కోయంబత్తూరులోని శ్రీకృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బీఈ చేశాడు.

శివకుమార్ మరణవార్త తెలుసుకున్న కోయంబత్తూరు సమీపంలోని నరసింహనైకెన్‌పాళయంలో నివసిస్తున్న అతని తల్లిదండ్రులు, సోదరుడు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

"""/" / తన అన్నయ్య మంచి విద్యార్ధి అని శివకుమార్ తమ్ముడు రోహన్ పేర్కొన్నారు.

ప్రతిరోజూ మాతో ఆయన ఫోన్‌లో మాట్లాడేవాడని, అన్నయ్య అసలు బకింగ్‌హామ్ కెనాల్ వద్దకు ఎందుకు వచ్చాడో అర్ధం కావడం లేదని , అతని మరణం వెనుక మిస్టరీ వుందని రోహన్ ఆరోపిస్తున్నారు.

అన్నయ్య మరణవార్త గురించి ఇంగ్లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం ద్వారా సమాచారం అందుకున్నట్లు చెప్పాడు.

మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి ఏం చేయాలో, ఎలాంటి నిబంధనలు పాటించాలో తెలియదని రోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ఇండియన్ నేషనల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐఎన్ఎస్ఏ) , ఆస్టన్ యూనివర్సిటీ శివకుమార్ కుటుంబానికి అండగా నిలుస్తోంది.

అతని మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.ఆ రోజు రాత్రి బకింగ్‌హామ్ కాలువ వద్దకు శివకుమార్ ఎందుకు వెళ్లాడో అంతు పట్టడం లేదని ఐఎన్ఎస్ఏ ప్రధాన కార్యదర్శి కిషోర్ దత్తు అంటున్నారు.

దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. """/" / అతని స్నేహితులు చెబుతున్నదానిని బట్టి.

ఘటన జరిగిన రోజు సాయంత్రం 6 గంటలకు శివకుమార్ లైబ్రరీకి వెళ్తున్నట్లు తెలిపాడు.

మరలా రాత్రి 9.30 గంటలకు భోజనానికి వస్తున్నావా లేదా అని స్నేహితులు అడగ్గా.

వచ్చేస్తున్నాని చెప్పాడు.అయితే రాత్రి 11 గంటలు కావొస్తున్నా రూమ్‌కి తిరిగి రాకపోవడం, ఫోన్‌కు స్పందించకపోవడంతో మిత్రులు ఆందోళనకు గురయ్యారు.

ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఈ విషాదం చోటు చేసుకుంది.

ఇన్స్టెంట్ గా గ్లోయింగ్ స్కిన్ ను పొందాలనుకుంటున్నారా.. అయితే ఇది ట్రై చేయండి!