భారతీయ విద్యార్ధి సత్తా: ఆస్ట్రేలియాలో చదువుకునేందుకు రూ.1.3 కోట్ల స్కాలర్‌షిప్
TeluguStop.com
భారతీయ విద్యార్ధికి ఆస్ట్రేలియాలో విద్యను అభ్యసించేందుకు గాను రూ.1.
3 కోట్ల స్కాలర్‌షిప్ లభించింది.సుమంత్ బిందాల్ అనే యువకుడు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్‌పీయూ)లో వ్యవసాయ రంగంలోని జన్యుశాస్త్రం, మొక్కల పెంపకంలో మాస్టర్స్ ఆఫ్ సైన్స్ చదువుతున్నాడు.
ఈ క్రమంలో బిందాల్ టమోటా మొక్కలను నాశనం చేసే ప్యూసేరియం అనే ఒక రకమైన ఫంగస్ గురించి పరిశోధన చేయాల్సి ఉంది.
ఇందుకు గాను ప్లాంట్స్ సైన్స్ అంశంలో ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేయాలని నిర్ణయించుకున్నాడు.
అక్కడ చదివుకునేందుకు బిందాల్‌కు 1.3 కోట్ల రూపాయల ఫుల్ పెయిడ్ స్కాలర్‌షిప్ లభించింది.
ప్యూసేరియం ఫంగస్ వల్ల ప్రతి ఏటా భారతదేశంలో టమోటా రైతులు 45 శాతం దిగుబడిని కోల్పోతున్నారు.
"""/"/
తనకు ఆస్ట్రేలియన్ స్కాలర్‌షిప్ లభించడంపై సుమంత్ సంతోషం వ్యక్తం చేశాడు.ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ ప్రపంచంలోని ప్రముఖ పరిశోధనా సంస్థల్లో ఒకటని ఆయన అభిప్రాయపడ్డాడు.
అక్కడ పీహెచ్‌డీ చేయాలనేది తన జీవితాశయమన్న సుమంత్.ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
సుమంత్ తైవాన్‌లోని వరల్డ్ వెజిటేబుల్ సెంటర్‌లో ఇంటర్న్‌షిప్ చేశాడు.ఈ సమయంలో ఆయన ఖర్చులన్నీ తైవాన్ ప్రభుత్వమే భరించేది.
ఈ సెంటర్‌లో ఇంటర్న్‌షిప్ కోసం ఎంపికైన 15 మంది మాస్టర్స్ డిగ్రీ విద్యార్ధులలో సుమంత్ బిందాల్ ఒకరు కావడం విశేషం.
ఇదేందయ్యా ఇది.. ఫ్రిడ్జ్ ను ఇలా కూడా వాడొచ్చా? వైరల్ వీడియో