అమెరికా : పూల్‌లో మునిగి భారతీయ యువకుడు మృతి.. కుటుంబానికి పెద్ద దిక్కయి, అంతలోనే
TeluguStop.com
ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లిన భారతీయుల మరణాలకు అడ్డుపడటం లేదు.
హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాల కారణంగా పలువురు భారతీయ విద్యార్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు.తాజాగా పంజాబ్‌లోని కపుర్తలా జిల్లా సుల్తాన్‌పూర్ లోధి సబ్ డివిజన్‌లోని మసీతాన్ గ్రామానికి చెందిన సాహిల్ ప్రీత్ సింగ్ ( Sahil Preet Singh )అనే యువకుడు అమెరికాలో ఓ స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి మృతి చెందాడు.
ముగ్గురు తోబుట్టువులలో పెద్దవాడైన సాహిల్ ఆ కుటుంబానికి ఆధారం.నీటిలో మునిగిపోతున్న స్నేహితుడిని కాపాడే ప్రయత్నంలో సాహిల్ మరణించినట్లుగా తెలుస్తోంది.
కుటుంబానికి ఆసరా ఉన్న కొడుకు దేశం కానీ దేశంలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుసుకున్న అతని తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
సాహిల్.పంజాబ్‌కే( Punjab
) చెందిన మరో మిత్రుడికి శాశ్వత పౌరసత్వం లభించడంతో ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు మిత్రులతో కలిసి ఫ్లోరిడాలోని ఓ స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లాడు.
ఈ క్రమంలో పూల్‌లోని లోతైన ప్రదేశంలో మిత్రుడు జారిపడిపోవడంతో అతనిని రక్షించేందుకు సాహిల్ ప్రయత్నించగా.
ఇద్దరూ పూల్‌లో మునిగిపోయారు. """/" /
సాహిల్ ఫ్లోరిడాలోని( Sahill Florida ) ఓ దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ ప్రమాదంపై సాహిల్ తమ్ముడు మంజోద్ సింగ్ మాట్లాడుతూ.2017లో తమ తండ్రి చనిపోవడంతో అన్నయ్య అమెరికా వెళ్లాడని తెలిపారు.
మా కుటుంబం మొత్తం అతనిపైనే ఆధారపడి జీవిస్తోందని.ఆయన మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి సాయం చేయాలని ముంజోద్ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.
సాహిల్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని పర్యావరణవేత్త, రాజ్యసభ ఎంపీ బల్బీర్ సింగ్ సీచెవాల్‌ను( MP Balbir Singh Seechewal ) అతని కుటుంబ సభ్యులు కోరారు.
"""/" /
కాగా.కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ కాటేదాన్‌కు చెందిన అక్షిత్ రెడ్డి( Akshit Reddy ) (26) అనే యువకుడు చికాగో నగరంలోని ఓ చెరువులో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
అక్షిత్ చికాగోలో ఉంటూ ఎమ్మెస్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు.డిసెంబర్‌లో పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేస్తుండగా అతని మరణవార్త తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఏంటి బాస్.. ఎప్పుడు దోశలు తినలేదా.. మరి ఇంత కక్కుర్తి ఏంటి? (వీడియో)