అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి మృతి.. భయాందోళనలో తల్లిదండ్రులు

ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్ధుల అకాల మరణాలు, హత్యలు, అదృశ్యాలకు ఏమాత్రం అడ్డుకట్ట పడటం లేదు.

తాజాగా అగ్రరాజ్యంలో మరో భారతీయ విద్యార్ధి ప్రాణాలు కోల్పోయాడు.తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గద్దె సాయి సూర్య అవినాష్ (26) ( Sai Surya Avinash Gadde )న్యూయార్క్ నగర సమీపంలోని అల్బానీ ప్రాంతంలో ఉన్న బార్బర్‌విల్లీ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.

జూలై 7 ఆదివారం ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. """/" / నీటి ఉదృతికి అవినాష్ కాలుజారి జలపాతంలో కొట్టుకుపోయాడు.

అతడిని రక్షించేందుకు మరొకరు నీటిలో దూకగా అతను కూడా కొట్టుకుపోయాడు.అయితే రెస్క్యూ సిబ్బంది వేగంగా స్పందించడంతో సదరు వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.

అవినాష్ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండం చిట్యాల గ్రామం.ఇతను ఎంఎస్ చేయడానికి గతేడాది అమెరికా వెళ్లినట్లుగా తెలుస్తోంది.

అవినాష్ మరణవార్తతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.అతని మృతదేహం ఈ శుక్రవారం స్వగ్రామానికి చేరుకునే అవకాశం వుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.

"""/" / అంతకుముందు ఏప్రిల్‌లో తెలంగాణకే చెందిన పాతికేళ్ల విద్యార్ధి కూడా క్లీవ్‌లాండ్ నగరంలో కనిపించకుండాపోయి శవమై కనిపించాడు.

హైదరాబాద్ నాచారంకు చెందిన మహ్మద్ అబ్ధుల్ అర్ఫాత్ .క్లీవ్‌లాండ్ యూనివర్సిటీలో ఐటీలో మాస్టర్స్ చేసేందుకు గతేడాది మేలో అమెరికా వెళ్లాడు.

మార్చి నెలలో భారత్‌కు చెందిన 34 ఏళ్ల శాస్త్రీయ నృత్యకారుడు అమర్‌నాథ్ ఘోష్ మిస్సౌరీలోని సెయింట్ లూయిస్‌లో కాల్చిచంపబడ్డాడు.

అలాగే పర్డ్యూ యూనివర్సిటీలో 23 ఏళ్ల భారతీయ అమెరికన్ విద్యార్ధి సమీర్ కామత్ ఫిబ్రవరి 5న ఇండియానాలో శవమై కనిపించాడు.

ఫిబ్రవరి 2న వివేక్ తనేజా (41)( Vivek Taneja ) అనే భారతీయ సంతతికి చెందిన ఐటీ ఎగ్జిక్యూటివ్ వాషింగ్టన్‌లోని ఒక రెస్టారెంట్ వెలుపల దాడికి గురయ్యాడు.

జనవరిలో 18 ఏళ్ల అకుల్ ధావన్ అనే మరో విద్యార్ధి ఇల్లినాయిస్ యూనివర్సిటీ క్యాంపస్ వెలుపల అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా మరణించాడు.

దీంతో అమెరికాలో చదువుకుంటున్న తమ పిల్లల భద్రత, క్షేమ సమాచారంపై తల్లిదండ్రులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీలో ధర్నా : అందరినీ ఏకం చేస్తున్న జగన్