గాలిమరల భవిష్యత్తు మార్చిన భారతీయ అమ్మాయి.. శతాబ్దాల నాటి ఏరోడైనమిక్స్ చిక్కుముడికి చెక్!
TeluguStop.com
ఇటీవల దివ్య త్యాగి( Divya Tyagi ) అనే ఇండియన్ స్టూడెంట్ వందేళ్ల నాటి ఏరోడైనమిక్స్( Aero Dynamics ) లోని ఓ చిక్కుముడిని ఒక్క సెకనులో విప్పేసింది.
ఈమె చేసిన పనితో గాలిమరల డిజైన్ మొత్తం మారిపోతుంది, వాటి సామర్థ్యం కూడా అమాంతం పెరిగిపోతుంది.
దివ్య పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్( Aerospace Engineering ) చదువుతోంది.
దివ్య, ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేస్తోంది.బ్రిటిష్ శాస్త్రవేత్త హెర్మన్ గ్లావర్ట్ అనే ఆయన ఎప్పుడో కొన్ని దశాబ్దాల కిందట గాలిమరల నుంచి పవర్ ఎలా ఎక్కువగా తీసుకోవచ్చో చెప్పే ఒక మోడల్ తయారు చేశారు.
కానీ, ఆయన కొన్ని ముఖ్యమైన విషయాలు పట్టించుకోలేదు.గాలిమర తిరిగేటప్పుడు దాని రోటర్ మీద ఎలాంటి ఫోర్స్ పడుతుంది? గాలి వేగానికి బ్లేడ్స్ ఎలా వంగుతాయి? ఇలాంటివి ఆయన లెక్కల్లోకి తీసుకోలేదు.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2025/03/indian-student-ya-tyagi-solves-100-year-old-math-problem-boosting-wind-turbine-efficiency-detailsd!--jpg" /
దివ్య కనిపెట్టిన సొల్యూషన్ మాత్రం గాలిమరలు( Wind Turbines ) ఎలా పనిచేస్తాయో మరింత క్లియర్ గా చూపిస్తుంది.
టర్బైన్‌పై పడే అన్ని ఫోర్స్‌లను లెక్కలోకి తీసుకుని, ఆమె ఒక కొత్త మోడల్ తయారు చేసింది.
ఇది నిజమైన పరిస్థితుల్లో టర్బైన్‌లు ఎలా పనిచేస్తాయో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది.దీనివల్ల భవిష్యత్తులో మరింత పవర్ ఫుల్, తక్కువ ఖర్చుతో విండ్ ఎనర్జీని తయారు చేయొచ్చు.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2025/03/indian-student-ya-tyagi-solves-100-year-old-math-problem-boosting-wind-turbine-efficiency-detailss!--jpg" /
ఈ అమ్మాయి చేసిన రిసెర్చ్ మామూలుది కాదు.అండర్ గ్రాడ్యుయేట్ చేస్తున్నప్పుడే ష్రేయర్ హానర్స్ కాలేజ్ థీసిస్ కోసం దీన్ని స్టార్ట్ చేసింది.
ఆ తర్వాత 'విండ్ ఎనర్జీ సైన్స్' అనే టాప్ జర్నల్‌లో కూడా పబ్లిష్ అయింది.
దివ్య చేసిన పనితో గాలిమరల నుంచి మాగ్జిమమ్ పవర్ తీసుకోవడానికి ఎలాంటి పరిస్థితులు ఉండాలో తెలుస్తోంది.
దీంతో రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో కొత్త దారులు తెరుచుకోనున్నాయి.ఆమె గైడ్, ప్రొఫెసర్ స్వెన్ ష్మిట్జ్ అయితే దివ్య టాలెంట్ చూసి షాక్ అయిపోయారు.
"దివ్య కనిపెట్టిన ఈ సొల్యూషన్ ప్రపంచవ్యాప్తంగా నెక్స్ట్ జనరేషన్ విండ్ టర్బైన్స్ డిజైన్ చేయడంలో గేమ్ ఛేంజర్ అవుతుంది" అని ఆయన పొగిడేశారు.
అంతేకాదు, ఈ రిసెర్చ్ తో విండ్ ఎనర్జీ ప్రొడక్షన్ పెంచడంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుందని ఆయన అన్నారు.
దివ్య చేసిన ఈ పనికి గాను ఆమెకు 'బెస్ట్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ థీసిస్' కోసం ఇచ్చే ఆంథోనీ ఇ.
వోల్క్ అవార్డు కూడా దక్కింది.ఇది చాలా ప్రెస్టీజియస్ అవార్డు.
దివ్య ఒక టాలెంటెడ్ ఏరోస్పేస్ ఇంజనీర్.కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ (CFD)లో ఆమెకు తిరుగులేదు.
ఇప్పుడు ఆమె హెలికాప్టర్లు మరింత సేఫ్ గా ఎగరడానికి అడ్వాన్స్డ్ ఫ్లైట్ సిమ్యులేషన్స్ మీద రీసెర్చ్ చేస్తోంది.
ఆమె రీసెర్చ్ కి US నేవీ సపోర్ట్ చేస్తోంది.అంటే ఆమె వర్క్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.