ప్రముఖ పాకిస్థానీ రెజ్లర్‌ను వీరబాదుడు బాదిన గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది.ఆ వీడియోలో ఇండియన్ స్టార్ రెజ్లర్‌ గ్రేట్ ఖలీ,( Great Khali ) పాకిస్థానీ రెజ్లర్‌ అయిన ఖాన్ బాబాను( Khan Baba ) ఓడించాడు.

గ్రేట్ ఖలీ అనేవాడు చాలా పెద్ద రెజ్లింగ్( Wrestling ) పోటిల్లో పాల్గొని, అండర్‌టేకర్, జాన్ సీనా, కేన్ లాంటి ప్రపంచ దిగ్గజ రెజ్లర్స్‌ను కూడా ఓడించాడు.

ఖలీ భారతదేశానికి వరల్డ్ స్థాయిలో గౌరవం తెచ్చాడు.అయితే, ఖాన్ బాబా అనేవాడు ఖలీతో ఎన్నోసార్లు వన్ ఆన్ వన్ పోటీ పడాలని కోరుకున్నాడు.

చివరికి ఖలీ అందుకు ఒప్పుకున్నాడు.ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య జరిగిన పోటీలో ఖలీ గెలిచాడు.

ఖాన్ బాబా కూడా గ్రేట్ ఖలీ లాగా చాలా పెద్దగా ఒక మాన్‌స్టార్ లాగానే కనిపిస్తాడు.

అయినా ఖలీ భయపడలేదు.ఆ సవాలును అంగీకరించి, రింగ్‌లో ఖాన్ బాబాను చాలా బాగా కొట్టాడు.

ఖాన్ బాబా భయంతో రింగ్ నుంచి దూకి, ఖలీని చూసి కేకలు వేయసాగాడు.

తర్వాత ఖాన్ బాబా ఖలీని పట్టుకోవడానికి వెళ్ళాడు కానీ, ఖలీ అతని దాడిని అడ్డుకోని, నేలపై పడవేశాడు.

"""/" / ఖలీ తన బలం, శక్తితో కేవలం కొన్ని దెబ్బలతోనే ఎవరినైనా నేల కూల్చగలడు.

ఖాన్ బాబాని కూడా అలాగే వీరబాదుడు బాదాడు.ఇంకో వీడియోలో, ఖాన్ బాబా లాగానే కనిపించే మరొక వ్యక్తిని రింగ్‌లో చూపించారు.

భారతీయ అభిమానులు అతన్ని రింగ్ నుంచి బయటకు నెట్టివేయడానికి ప్రయత్నించారు కానీ, అది సాధ్యం కాలేదు.

ఆ తర్వాత ఖలీ వచ్చి, ఒక్క తన్ను తన్ని అతన్ని రింగ్ బయటకు పడవేశాడు.

"""/" / అంతకు ముందు, ఇతర భారతీయ రెజ్లర్లను( Indian Wrestlers ) కూడా ఆ వ్యక్తిని కాలితో తన్ని, చేతులతో కొట్టారు కానీ అతన్ని కదల్చలేకపోయారు.

అయితే, ఖలీ జస్ట్ సింగిల్ కిక్ తో, ఆ బాబాను క్షణాల్లో రింగ్ బయటకు పడవేశాడు.

అదే అందర్నీ ఆశ్చర్యపరిచింది.ఖలీ చెప్పినట్లు, ఖాన్ బాబా తరచుగా తనని సవాలు చేస్తుంటాడు.

ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఖాన్ బాబాలాగే దుస్తులు ధరించాడు.ఈ వీడియోను గ్రేట్ ఖలీ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు.

అభిమానులు ఈ వీడియోకు బాగా స్పందించి, సోషల్ మీడియాలో వేలాది మందితో పంచుకున్నారు.

Https://!--wwwfacebook!--com/share/v/4h7gkWPpY7YQML2o/ ఈ లింకు పై క్లిక్ చేసి ఖలీ, బాబా మధ్య ఫైట్ వీడియో చూడవచ్చు.

సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఖాతాలో మరో క్రేజీ రికార్డ్.. ఏం జరిగిందంటే?