అమెరికాలో సిక్కులే టార్గెట్ గా జాత్యహంకార దాడులు..
TeluguStop.com
అమెరికాలో రోజు రోజు కి జాత్యహంకార దాడులు పెరిగిపోతున్నాయి.కూచిబొట్ల పై జరిగిన జాత్యహంకార హత్య తరువాత ఎన్నో దాడులు భారతీయులపై జరిగాయి.
ఎన్నో అవమానాలు మధ్య అమెరికాలో భారతీయులు చాలా మంది బిక్కు బిక్కు మంటున్నారు.
అయితే ఈ తరుణంలోనే మరిన్ని దాడులు భారతీయులపై జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
తాజాగా మరొక జాత్యహంకార హత్య అమెరికాలో వెలుగు చూసింది.వివరాలలోకి వెళ్తే.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఇటీవల ఈ నెల 6 న కాలిఫోర్నియా లో ఒక వృద్ద సిక్కు పై దుండగులు దాడి చేసి దారుణాతి దారుణంగా హత్య హత్య చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఇంకా ఆ ఘటన మరువక ముందే తాజాగా అమెరికాలోని న్యూజెర్సీలో ఒక సిక్కు వ్యక్తి హత్యకు గురయ్యారు.
గడిచిన నెలరోజుల్లో ఇది మూడవ సంఘటన కావడం గమనార్హం.అక్కడ మైనార్టీలైన సిక్కులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
అమెరికాలోనే నివాసం ఉంటూ ఒక షాపుని నడుపుకుంటున్న సిక్కు వ్యక్తి.
గురువారం అతని షాపులోనే మృతి చెంది ఉండటాన్ని బంధువు తెర్లోక్ సింగ్ గుర్తించారు సదరు వ్యక్తి చాతీపై గాయాలైనట్లు తెలుస్తుంది.
అయితే ఈ హత్య ఎందుకు చేశారు అనే విషయం మాత్రం తెలియరాలేదు.అయితే హత్యకి గురయిన వ్యక్తి భార్య, పిల్లలు భారత్‌లో నివసిస్తున్నారు ఇది ముమ్మాటికీ జాత్యహంకార హత్యే అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
డాకు మహారాజ్ రివ్యూ & రేటింగ్