భారతీయుడిని కాల్చిచంపిన ఆస్ట్రేలియా పోలీసులు.. అందరూ చూస్తుండగానే, కారణమేంటీ..?
TeluguStop.com
ఆస్ట్రేలియా పోలీసులు ఓ భారతీయుడిని నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కాల్చిచంపారు.మరో వ్యక్తిని హత్య చేసేందుకు ప్రయత్నిస్తుండగా.
పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.వివరాల్లోకి వెళితే.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన సయ్యద్ అహ్మద్ (32) బ్రిడ్జింగ్ వీసాపై ఆస్ట్రేలియాలో వుంటున్నాడు.
ఈ నేపథ్యంలో మంగళవారం సిడ్నీ రైల్వే స్టేషన్‌లో ఓ క్లీనర్‌ను కత్తితో పొడవడానికి సయ్యద్ ప్రయత్నించాడు.
దీనిని గమనించిన పోలీసులు సయ్యద్‌ను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.కానీ అతను వారిపైనా దాడికి యత్నించాడు.
ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారి తన ఆత్మరక్షణార్ధం సయ్యద్‌పై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో సయ్యద్ ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి.తీవ్రంగా గాయపడిన అతనిని పోలీసులు ఆసుపత్రికి తరలించగా.
అప్పటికే సయ్యద్ ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు వెల్లడించారు.ఈ ఘటనపై సిడ్నీలోని భారత కాన్సులేట్ కార్యాలయం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
దీనిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం, పోలీసుల నుంచి పూర్తి నివేదికను కోరింది.విదేశీ వ్యవహారాలు, వాణిజ్య విభాగం దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పింది.
అయితే సయ్యద్‌పై ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని సిడ్నీ పోలీసులు స్పష్టం చేశారు.
జరిగిన ఘటనను తీవ్రవాద దాడిగా పరిగణించలేమని పోలీసులు పేర్కొన్నారు.ఈ ఘటనపై విచారణకు యాంటీ టెర్రరిజం యూనిట్ సహాయం కూడా తీసుకుంటామని న్యూసౌత్ వేల్స్ పోలీస్ అసిస్టెంట్ కమీషనర్ వెల్లడించారు.
"""/" /
ఇదిలావుండగా.గత కొద్దిరోజులుగా ఆస్ట్రేలియాలో ఖలిస్తానీ మద్ధతుదారులు వీరంగం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
హిందూ దేవాలయాలను టార్గెట్ చేసి వాటిపై ఖలిస్తాన్ అనుకూల నినాదాలు, భారత వ్యతిరేక రాతలను రాస్తున్నారు.
ఇది మరింత తీవ్రస్థాయికి చేరుకుని ఏకంగా తోటి భారతీయులపైనే ఖలిస్తాన్ మద్ధతుదారులు దాడికి పాల్పడ్డారు.
భారత జాతీయ పతాకాలను పట్టుకున్న వారిని చితకబాదడంతో పాటు కత్తులతో బెదిరించారు.మన జెండా కర్రల్ని ధ్వంసం చేశారు.
ఈ చర్యలను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. """/" /
తాజాగా ఖలిస్తాన్ మద్ధతుదారులు మరింత రెచ్చిపోయారు ఏకంగా బ్రిస్బేన్‌లోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయంపై దాడికి తెగబడ్డారు.
నగరంలోని టారింగా శివారులోని స్వాన్ రోడ్‌లో వున్న భారత కాన్సులేట్‌ను ఫిబ్రవరి 21 రాత్రి ఖలిస్తాన్ మద్ధతుదారులు లక్ష్యంగా చేసుకున్నారని ఆస్ట్రేలియా టుడే వార్తా సంస్థ నివేదించింది.
భారత కాన్సులేట్ జనరల్ అర్చనా సింగ్ ఫిబ్రవరి 22న కార్యాలయానికి వచ్చిరాగానే ఖలిస్తాన్ జెండా చూసి షాక్‌కు గురయ్యారు.
మరోసారి వెండితెర సందడికి సిద్ధమైన యాంకర్ సుమ…. హిట్ కొట్టేనా?