భారతీయ షిప్ కెప్టెన్‌కు ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనేషన్ అవార్డ్!

ఈ ఏడాది ప్రారంభంలో రెడ్ సీ రెస్క్యూ మిషన్‌లో( Red Sea Rescue Mission ) చూపిన అసాధారణ ధైర్య సాహసాలకు గాను భారత్‌కు చెందిన షిప్ కెప్టెన్ అవిలాష్ రావత్‌కు( Ship Captain Avhilash Rawat ) 2024 ఏడాదికి గాను ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ (ఐఎంవో) అవార్డ్( International Maritime Organisation Award ) వరించింది.

సోమవారం లండన్‌లోని( London ) ఐఎంవో ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డ్ అందుకున్నారు.

ఈ ఏడాది జనవరిలో యాంటీషిప్ బాలిస్టిక్ మిస్సైల్ వీరు ప్రయాణిస్తున్న నౌకను తాకి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.

ఆ సమయంలో మంటలను అదుపు చేయడం, ఇతర నష్ట నివారణ చర్యలను సమన్వయం చేయడంతో పాటు సిబ్బందికి ధైర్యం నూరిపోశారు రావత్.

"""/" / ఈ సందర్భంగా రావత్ మాట్లాడుతూ.నా సిబ్బందికి వారి అసాధారణమైన ధైర్యం, వృత్తి నైపుణ్యం, అచంచలమైన అంకిత భావం గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు.

మార్లిన్ లువాండా సిబ్బంది తరపున తాను భారతీయ, ఫ్రెంచ్, యూఎస్ నౌకాదళాలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రావత్ చెప్పారు.

యెమెన్‌లోని హూతీ రెబల్స్‌ ఆధిపత్యం ఉన్న ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ వాణిజ్యానికి, నౌకలకు ఎదురవుతున్న భద్రతా సమస్యల గురించి ప్రశ్నించగా.

ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్ధితి ఉద్రిక్తంగా ఉందని రావత్ తెలిపారు. """/" / ఎర్ర సముద్రం గుండా నౌకలను పంపడం ఆపమని తాను అభ్యర్ధిస్తున్నానని.

ఈ సంఘటన తర్వాత తమ కంపెనీ ఈ చర్యలు చేపట్టిందని తెలిపారు.ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌‌కు చెందిన రావత్.

సన్‌టెక్ షిప్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్ మెరైనర్ కోర్స్ అభ్యసించారు.సముద్రంలో జీవితం ఎప్పుడూ లాభదాయకమేనని.

యువత సముద్ర సంబంధిత రంగాల వైపు రావాలని ఆయన పిలుపునిచ్చారు.వివిధ దేశాలు, వ్యక్తులు, సంస్కృతుల గురించి తెలుసుకునేలా చేస్తుందని.

జీవితంలో ఎలాంటి విపత్కర పరిస్ధితుల్లోనైనా పోరాడటం నేర్పిస్తుందని రావత్ అన్నారు.ఇకపోతే.

కెప్టెన్ బ్రిజేష్ నంబియార్‌, భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ విశాఖపట్నం క్రూ సిబ్బందికి ‘లెటర్ ఆఫ్ మెమెన్డేషన్’ అవార్డు దక్కింది.

విపత్తు సమయంలో మార్లిన్ లువాండాకు అండగా నిలిచినందుకు గాను ఈ సత్కారం లభించింది.

డస్ట్ అలెర్జీ తో బాధపడుతున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!