ఖగోళంలో మరొక అద్భుతాన్ని కనుగొన్న భారత శాస్త్రవేత్తలు..!
TeluguStop.com
అంతరిక్ష పరిశోధనల్లో మన శాస్త్రవేత్తలు అద్భుతమైన విజయం సాధించారు.అంతరిక్షంలోని మూడు అతిభారీ బ్లాక్‌హోల్స్ ఒక్కటిగా అయ్యి ట్రిపుల్ యాక్టివ్ గెలాక్టిక్ న్యూక్లియస్ గా ఏర్పడ్డాయని మన భారతదేశ ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
అంతరిక్షంలోని పాలపుంత మధ్య భాగంలో ఈ మూడు బ్లాక్‌హోల్స్ ఒక్కటి అవుతున్న ఘటనను డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్‌టి) గుర్తించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
ఇలా 3 బ్లాక్ హోల్స్ కలవడం వలన ఆ పాలపుంత నుంచి అత్యధిక కాంతి విడుదలైందని తెలిపింది.
నిజానికి బ్లాక్ హోల్స్ అంటేనే అధిక ద్రవ్యరాశిని కలిగి ఉండి అతి తక్కువ స్థలాన్ని ఆక్రమించే ఒక శక్తి కేంద్రకాలు.
ఇవి వాటివైపు వెళ్లిన కాంతిని కూడా అవి తమవైపు లాగేసుకుంటాయి కావున అవి కనిపించవు.
అలాగే కాంతితో పాటు వాటి సమీపంలోని ధూళి, వాయువుల్ని కూడా లాక్కుంటాయి.ఆ సమయంలోనే వాటి నుంచి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ విడుదలవుతుంది అన్నమాట.
ఇలా మూడు బ్లాక్ హోల్స్ ఒక్కటి అయ్యేటప్పటికి ఆ పాలపుంతలో ఎక్కువ కాంతి విడుదలయింది అంటున్నారు శాస్త్రవేత్తలు.
ఎన్ జీసీ7733ఎన్ అనేది ఎన్ జీసీ7734 గ్రూప్ లో ఒక భాగం మాత్రమే.
ఇప్పుడు ఈ గెలాక్సీ జంట అయిన ఎన్ జీసీ7733ఎన్, ఎన్ జీసీ7734 రెండింటిలోని పాలపుంతలు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి.
"""/"/
సాధారణంగా ఇలా రెండు కృష్ణబిలాల ఒకదానితో ఒకటి కలిసినప్పుడు ఈ రెండిటి కలయిక కారణంగా తీవ్రమైన ఒత్తిడి కలగుతుంది.
కానీ ఈ గెలాక్సీ జంట విలీనం ఒకదానితో ఒకటి కాకుండా పక్కనే ఉన్న మూడో భారీ బ్లాక్ హోల్ తో కూడా కలవడం వలన ఒత్తిడి అనేది అంతగా ప్రభావం చూపలేకపోయిందని తెలిపారు.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ కు చెందిన జ్యోతి యాదవ్ మౌసుమి దాస్ సుధాన్షు బార్వే ఆస్ట్రోసాట్ అబ్జర్వేటరీ ద్వారా అల్ట్రా వయొలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ సాయంతో ఈ బ్లాక్ హోల్స్ ను చూడడం జరిగింది.
అలాగే శాస్త్రవేత్తలు కనుకొన్న ఈ కృష్ణ బిలాల విలీనానికి సంబంధించిన అతి కాంతవంతమైన Uv-h ఆల్ఫా ఫోటోలని కూడా రిలీజ్ చేశారు.
పాలు, అంజీర్ కలిపి తీసుకుంటే ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా?