రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆ భయం అక్కర్లేదు!

ప్రతిరోజు రైళ్లలో కోట్లాది మంది ప్రజలు ప్రయాణాలు చేస్తుంటారు.అయితే ప్రయాణికులు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో నిద్రలోకి జారుకుంటామోననే భయం ఒకటి.

సాధారణంగా చాలామంది ప్రయాణికులు ట్రైన్లలో రాత్రులు ప్రయాణం చేస్తుంటారు.ఈ సమయంలో తమ స్టేషన్ వచ్చే వరకు మెలుకువతోనే ఉంటారు.

కానీ ఒక్కోసారి నిద్ర ముంచుకొచ్చి పడుకుంటారు.అయితే వారు దిగే స్టేషన్‌లో ట్రైన్ ఐదు నిమిషాల కంటే తక్కువ సేపే ఉంటే వారు దిగటం మిస్ అవ్వడం ఖాయం.

దీనివల్ల చాలా అవస్థలు ఎదుర్కోవలసి వస్తుంది.అయితే ఇలాంటి సమస్యపై దృష్టి సారించిన ఇండియన్ రైల్వే ప్రయాణికులకు తీపి కబురు చెప్పింది.

కొత్తగా డెస్టినేషన్‌ అలర్ట్‌ వేకప్‌ (wakeup Alert) అనే సదుపాయాన్ని పరిచయం చేసింది.

ఈ సదుపాయం వల్ల ప్రయాణికులు భయం లేకుండా నిద్రపోవచ్చు.వారు దిగాల్సిన స్టేషన్‌ రావటానికి 20 నిమిషాల ముందే ఈ సదుపాయం ప్రయాణికులను నిద్ర లేపుతుంది.

తద్వారా దిగాల్సిన స్టేషన్ మిస్స్ అవ్వడం జరగదు.ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునేందుకు ప్రయాణికులు 139 నంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది.

కాల్ చేసిన అనంతరం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని.డెస్టినేషన్‌ అలర్ట్‌ కోసం 7పై నొక్కాలి.

"""/"/ ఆపై మీ ట్రైన్ టికెట్‌లో కనిపించే 10 అంకెల ప్యాసింజర్ నేమ్ రికార్డ్ (PNR) నంబర్‌ ఎంటర్ చేయాలి.

దీనిని కన్ఫామ్ చేసేందుకు 1 డయల్‌ చేయాలి.వెరిఫికేషన్ పూర్తయ్యాక మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ అందుతుంది.

అంతే, వేకప్ అలర్ట్ కాల్ అనేది మీరు దిగాల్సిన స్టేషన్ రావటానికి 20 నిమిషాల ముందే అలర్ట్ చేస్తుంది.

తద్వారా మీరు స్టేషన్ మిస్ అయ్యే అవకాశమే ఉండదు.అయితే ఐఆర్‌సీటీసీ ఈ సదపాయాన్ని రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7గంటల వరకు మాత్రమే ఆఫర్ చేస్తోంది.

ఒకవేళ మీకు కాల్ చేసే పరిస్థితి లేకపోతే ALERT అని స్పేస్‌ ఇచ్చి PNR నంబర్‌ టైప్‌ చేసి 139కి మెసేజ్‌ చేసినా కాల్ రూపంలో అలర్ట్ పొందవచ్చు.

సునీల్ ఒక్కో సినిమాకి ఎంత డబ్బులు తీసుకుంటారో తెలుసా.. ఏడాది ఆదాయం ఎంతంటే..??