వైరల్: రోబోను మించిపోయిన రైల్వే ఉద్యోగి.. అసలు మ్యాటరెంటంటే..?!
TeluguStop.com
ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు లైఫ్ సెట్ అయిపొతుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు.
ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే బెనిఫిట్స్ చాలా ఉంటాయి కాబట్టి.అయితే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం పొందితే కష్టపడాల్సిన పనిలేదని అనుకుంటూ ఉంటారు.
నెల తిరిగే పాటికి ఎటువంటి డోకా లేకుండా జీతం వచ్చేస్తుంది.అయితే ప్రభుత్వ ఉద్యోగులు తమ పని సరిగ్గా చేయరని, ఉద్యోగం వచ్చిన వెంటనే బద్దకస్తులుగా మారిపోతారని మనలో చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు.
అయితే అందరు అలానే ఉంటారని అనుకుంటే పొరపాటు పడినట్లే.ఎందుకంటే ఈ వీడియోలో కనిపించే ఒక ప్రభుత్వ ఉద్యోగి తన బాధ్యతలను ఎంత సక్రమంగా నిర్వర్తిస్తున్నాడో మీరు చూడొచ్చు.
ప్రస్తుతం ఒక ప్రభుత్వఉద్యోగికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సాధారణంగా మనం రైలు టికెట్లు తీసుకోవాలంటే రైల్వే స్టేషన్ లోని టికెట్ కౌంటర్ దగ్గర తీసుకుంటూ ఉంటాము కదా.
ఒక్కోసారి పెద్ద పెద్ద క్యూ లైన్స్ లో కూడా నుంచుని మరి మనం టికెట్ తీసుకున్న సందర్బాలు ఉన్నాయి.
అయితే కొన్నిసార్లు టిక్కెట్ కౌంటర్ దగ్గర రష్ ఉండంతో టికెట్ తీసుకోకుండానే రైలు ప్రయాణాలు చేయాలిసిన పరిస్థితి వస్తుంది.
ఇలాంటి సంఘటనలు జరగడం రైల్వే శాఖలో సర్వసాధారణమైన విషయమే.అయితే ఒక రైల్వే ఉద్యోగి మాత్రం టికెట్ కోసం వచ్చిన ప్రయాణికులకు టక్కెట్లు ఇస్తున్న తీరు చూస్తే మాత్రం తప్పకుండా షాక్ అవ్వాలిసిందే.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. """/"/
టిక్కెట్లు ఇవ్వండంలో పెద్ద విషయమేముంది.
అందరు ఇస్తారు కదా అని అనుకుంటున్నారా.? కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.
ఎందుకంటే ఈ వీడియోలో కనిపించే వ్యక్తి అందరిలా టికెట్స్ ఇవ్వడు.ఒక రోబో మాదిరిగా స్పీడ్ స్పీడ్ గా వచ్చిన ప్రయాణికులకు ఆటోమేటిక్ వెండింగ్ మెషీన్‌లో టికెట్లు ఇచ్చేస్తున్నాడు.
అతను కేవలం పదిహేను సెకన్లలో మూడు టిక్కెట్లను ప్రయాణికులకు అందించాడు అంటే అతని టాలెంట్ ఏంటో ఈపాటికే మీకు అర్ధం అయి ఉంటుంది.
కేవలం తన దగ్గరకు వచ్చినా ప్రయాణికుల యొక్క గమ్యస్థానాన్ని మాత్రమే అడుగుతూ ప్రయాణికుడి నుంచి డబ్బులు తీసుకుని ఎంతో ఫాస్ట్ గా మెషిన్ ఆపరేట్ చేస్తూ వాళ్లకి టిక్కెట్ ఇవ్వడం మనం వీడియోలో చూడొచ్చు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇతను రోబో కంటే స్పీడ్ గా టిక్కెట్లను ఇస్తున్నాడంటూ నెటిజన్లు అతనిని తెగ పొగిడేస్తున్నారు.