మీకు దమ్ముంటే ఆర్టికల్‌ 370 తీసుకు వస్తారా?

ప్రధాని నరేంద్ర మోడీ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్న విషయం తెల్సిందే.

దేశ వ్యాప్తంగా మోడీ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం అయ్యింది.అయితే కాంగ్రెస్‌ పార్టీ మాత్రం తాము ఆర్టికల్‌ 370 రద్దు చేస్తే ఏదో తప్పు చేసినట్లుగా విమర్శలు చేస్తున్నారంటూ బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోడీ హర్యానా ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆర్టికల్‌ 370ని మేము రద్దు చేశాం.ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే మళ్లీ ఆర్టికల్‌ 370 ని తీసుకు వచ్చే సత్తా ఉందా.

కనీసం మీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆర్టికల్‌ 370ని తీసుకు వస్తామంటూ పెట్టగలరా అంటూ ప్రశ్నించాడు.

రాహుల్‌ గాంధీ గతంలో రఫెల్‌ యుద్ద విమానాల గురించి తీవ్ర విమర్శలు చేశారు.

ఆ ఒప్పందం రద్దు చేసుకోవాలంటే తీవ్రంగా ఒత్తిడి చేశాడు.ఇప్పుడు రఫెల్‌ యుద్ద విమానాలు రెడీ అయ్యి ఇండియాకు వచ్చేందుకు సిద్దం అయ్యాయి.

ఆ యుద్ద విమానాలు వస్తే ఇండియాకు గొప్ప బలం వస్తుందని మోడీ అన్నాడు.

కాంగ్రెస్‌ పార్టీ దేశ భవిష్యత్తు కోసం ఏమాత్రం పని చేయడం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

శంకర్ విషయం లో చాలా తక్కువ అంచనా వేస్తున్న జనాలు…