Nirmal Kumar: ఈ ఎమ్మెల్యే ఆస్తి కేవలం రూ.1700నే.. కానీ ఎన్నికల్లో రూ.15 లక్షల ఖర్చు.. !
TeluguStop.com
ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే ప్రజాప్రతినిధులు భయపడే పరిస్థితి నెలకొంది.ఎందుకంటే ఎన్నికల్లో పోటీలోకి దిగాలంటే రూ.
లక్షలు, రూ.కోట్లల్లో ఖర్చు అవుతుంది.
సర్పంచ్‌గా పోటీ చేయాలంటే రూ.లక్షలు, ఎమ్మెల్యే, ఎంపీగా నిలబడాలంటే రూ.
కోట్లల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది.దీంతో ఎంతో ధనవంతులు, పెద్ద వ్యాపార వేత్తలు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారం, వాహనాల ఖర్చులు, బహిరంగ సభలు, ర్యాలీలకు జనసమీకరణ, కార్యకర్తలకు భోజనాలు, సోషల్ మీడియాలో ప్రచారం, ఫ్లెక్సీలు, బ్యానర్లు వంటి వాటికి రూ.
లక్షల్లో ఖర్చు అవుతున్నాయి.ఇక అనధికారికంగా ఓటర్లకు పంచే డబ్బులు లెక్క చూసుకుంటే రూ.
కోట్లల్లో అభ్యర్థులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. """/" /
అయితే తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్( Association For Democratic Reforms ) అనే సంస్థ విడుదల చేసిన నివేదికలో కీలక విషయాలు బయటపడ్డాయి.
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల సంఘానికి ఎన్నికలు ముగిసిన తర్వాత ఖర్చు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
వీటి వివరాల ఆధారంగా ఒక రిపోర్ట్ ను ఏడీఆర్( ADR ) విడుదల చేసింది.
ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.ప్రపంచంలోనే అత్యంత పేద ఎమ్మెల్యేగా పశ్చిమబెంగాల్‌లోని ఇండస్ నియోజకవర్గానికి చెందిన నిర్మల్ కుమార్( Nirmal Kumar ) ఉన్నారు.
తన ఆస్తిని కేవలం రూ.1700 గా ఆయన అఫిడవిట్‌లో చూపించారు.
తనకు కారు, ఇల్లు, ఆస్తులు లేవని పేర్కొన్నారు. """/" /
కానీ నిర్మల్ కుమార్ గత ఎన్నికల్లో రూ.
14.75 లక్షలు ఖర్చు చేశారు.
నిర్మల్ కుమార్ బీజేపీ తరపున పోటీ చేశాడు.దీంతో ప్రచారం కోసం ఆయనకు పార్టీ రూ.
15 లక్షలు డబ్బులు ఇచ్చింది.ఆ డబ్బుల్లో ప్రచారం కోసం రూ.
14.75 లక్షలను నిర్మల్ కుమార్ ఖర్చు చేశాడు.
ర్యాలీలు, బహిరంగ సభల కోసం రూ.6.
4 లక్షలు, స్టార్ క్యాంపెయినర్ కోసం రూ.82 వేలు, ప్రచార సామాగ్రి కోసం రూ.
1.26 లక్షలు, యాడ్స్ కోసం రూ.
లక్ష, వెహికల్స్ కోసం రూ.2.
88 లక్షలు, వర్కర్స్ కోసం రూ.2.
39 లక్షలు ఖర్చు పెట్టారు.ఇక దేశంలోనే రెండో పేద ఎమ్మెల్యేగా ఒడిశాలోని రాయగడ స్వతంత్ర అభ్యర్థి మకరంద ముదిలి ఉన్నారు.