కెనడాలో అనుమానాస్పద స్థితిలో శవమై తేలిన భారత సంతతి యువతి

కెనడా( Canada )లో విషాదం చోటు చేసుకుంది.హాలిఫాక్స్ నగరంలోని వాల్‌మార్ట్ స్టోర్ బేకరీ డిపార్ట్‌మెంట్‌ వాక్ ఇన్ ఓవెన్‌లో 19 ఏళ్ల సిక్కు యువతి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది.

హాలిఫాక్స్ రీజినల్ పోలీస్ (హెచ్ఆర్పీ) ఈ మేరకు ప్రకటన చేసింది.శనివారం రాత్రి 9.

30 గంటల సమయంలో 6990 మమ్‌ఫోర్డ్ రోడ్‌లోని వాల్‌మార్ట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలిపారు.

మృతురాలు ఓ దుకాణంలో పనిచేస్తున్నట్లుగా సమాచారం. """/" / బాధితురాలు తమ సంఘంలో సభ్యురాలని మారిటైమ్ సిక్కు సొసైటీ( Maritime Sikh Society ) సీటీవీ న్యూస్‌కి సమాచారం అందించింది.

ఈ సొసైటీకి చెందిన అన్మోల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.ఆమె మరణం మాకు, ఆమె కుటుంబానికి తీరని ఆవేదనని మిగిల్చిందన్నారు.

ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న ఆమె జీవితాన్ని కోల్పోయిందని అన్మోల్ పేర్కొన్నారు.బాధిత యువతి ఇటీవలే భారత్ నుంచి కెనడాకు వచ్చినట్లుగా ది గ్లోబ్ అండ్ మెయిల్ వార్తాపత్రిక తెలిపింది.

విచారణ నేపథ్యంలో శనివారం రాత్రి నుంచి వాల్‌మార్ట్ స్టోర్ మూసి వేశారు.హాలిఫాక్స్ పోలీసులు దర్యాప్తులో భాగంగా వివిధ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటున్నారని దర్యాప్తు అధికారులు తెలిపారు.

"""/" / సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతోన్న ఊహాజనత సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్ఆర్పీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

నోవాస్కోటియా ప్రావిన్స్ మెడికల్ ఎగ్జామినర్ బాధిత యువతి మరణానికి దారి తీసిన కారణాలను అన్వేషించే పనిలో ఉన్నారు.

ఈ ప్రావిన్స్‌కు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సేఫ్టీ ఈ విచారణలో పాల్గొంటోంది.

భారత సంతతి యువతి మరణంపై వాల్‌మార్ట్( Canada Walmart ) కెనడా సంతాపం ప్రకటించింది.

కాగా.గత నెలలో కెనడాలో 22 ఏళ్ల భారతీయ విద్యార్ధి హత్యకు గురైన సంగతి తెలిసిందే.

అల్బెర్టా ప్రావిన్స్‌లోని డౌన్‌టౌన్ ఎడ్మాంటన్ పార్కింగ్‌లో అతనిని ఓ పదునైన ఆయుధంతో హత్య చేశారు.

మృతుడిని పంజాబ్‌లోని మలేర్‌కోట్లలోని బద్లా గ్రామానికి చెందిన జషన్‌దీప్ సింగ్ మాన్‌గా గుర్తించారు.

ఇతను 8 నెలల క్రితం అంతర్జాతీయ విద్యార్ధిగా కెనడాకు వచ్చాడు.ఈ ఘటనకు సంబంధించి ఎడ్మాంటన్ పోలీసులు 40 ఏళ్ల ఎడ్గార్ విస్కర్‌పై సెకండ్ డిగ్రీ హత్య కేసు అభియోగాలు మోపారు.

హత్య తర్వాత నిందితుడు ఘటనా స్థలంలోనే ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.

అల్లు అర్జున్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడా..?