గో బ్యాక్ టూ ఇండియా : అల్బేనియాలో భారత సంతతి మహిళపై జాత్యహంకార వ్యాఖ్యలు
TeluguStop.com
అల్బేనియన్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో జాసన్ డెరు( Jason Derulo ) కచేరీకి హాజరైన భారత సంతతి మహిళ అక్కడి స్థానికుల నుంచి జాత్యహంకారాన్ని, విద్వేషాన్ని ఎదుర్కొంది.
దీనికి సంబంధించిన వీడియోను ఓ ఎక్స్ యూజర్ ట్వీట్ చేశారు.అందులో భారత సంతతికి చెందిన మహిళ తనపై నలుగురు స్థానిక యువతులు జాతి విద్వేష వ్యాఖ్యలు చేశారని తెలిపారు.
వారు లైన్‌లో తనను దాటి వెళ్లారని.ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించగా.
ఆ అమ్మాయిలు తనను గో బ్యాక్ టూ ఇండియా అని దూషించారని , నవ్వుతూ , అసభ్యకరమైన సైగలు చేసినట్లు బాధితురాలు తెలిపింది.
"""/" /
బాధితురాలిని డాక్టర్ ప్రణోతి క్షీరసాగర్‌గా గుర్తించారు.తనకు అల్బేనియా అద్భుతంగా స్వాగతం పలికింది, గ్రేట్ జాబ్.
చాలా థ్యాంక్స్ అంటూ ఆమె వ్యంగ్యంగా వీడియోను ముగించారు.తొలుత ఈ వీడియోను డాక్టర్ ప్రణోతి( Dr.
Kshirsagar ) టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేశారు.ఈ వీడియో ఆగస్ట్ 20న పోస్ట్ చేయగా అప్పటి నుంచి 2.
6 మిలియన్ల వీక్షణలు, అనేక కామెంట్స్‌ను పొందింది.కొంతమంది ఎక్స్ యూజర్లు భారత సంతతికి చెందిన మహిళకు మద్ధతుగా నిలిచారు.
అల్బేనియా పర్యాటకానికి సురక్షిత స్థలం కాదని సూచించారు.అల్బేనియా అల్బేనియన్ల కోసం, భారతదేశం భారతీయులకు, జర్మనీ జర్మన్లకంటూ ఓ యూజర్ ఈ పనిని వెనకేసుకొచ్చినట్లుగా కామెంట్ చేశాడు.
మరో వ్యక్తి కూడా .గో బ్యాక్ ప్లీజ్.
మీ కమ్యూనిటీకి సహాయం చేయండి, వచ్చి మా సంఘాన్ని నాశనం చేయొద్దని రాశాడు.
"""/" /
దీనికి భారతీయులు, నెటిజన్లు కౌంటర్ ఇస్తూ.బాధితురాలికి అండగా నిలిచారు.
అల్బేనియన్లు కూడా ఈయూ, యూకేకి వలస వెళ్లినప్పుడు ఎదుర్కొన్న వివక్ష, జాత్యహంకారంపై ఫిర్యాదు చేసిన ఘటనలను గుర్తుచేశారు.
మొత్తానికి ఈ వైరల్ వీడియో పర్యాటకం, జాత్యహంకారం చుట్టూ ఉన్న సవాళ్లు, విభిన్న అభిప్రాయాలను రెండింటినీ హైలైట్ చేసింది.
విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల పట్ల గౌరవ ప్రదమైన ప్రవర్తనతో ఉండాలని సూచించారు.
ఇదేందయ్యాఇది.. ఎయిర్ పోర్టులో పట్టుబడ్డ బేబీ గొరిల్లా..