క్యాన్సర్‌తో పోరాటం.. మానవాళి కోసం తనపైనే క్లినికల్ ట్రయల్స్‌‌, భారత సంతతి మహిళ జీవితంలో అద్భుతం

క్యాన్సర్ మహమ్మారి కబంద హస్తాలకు చిక్కి.ఇక కొన్ని నెలలు మాత్రమే జీవిస్తుందని డాక్టర్లు సైతం చేతులేత్తేసిన కేసులో ఓ 51 ఏళ్ల భారత సంతతి మహిళ విషయంలో అద్భుతం జరిగింది.

రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించిన ఒక కొత్త మందుపై క్లినికల్ ట్రయల్ లో పాల్గొన్న అనంతరం ఆమెలో క్యాన్సర్ కు సంబంధించిన కణాలు కనిపించలేదని.

ఇంకొన్నాళ్లు బతికవచ్చని వైద్యులు చెప్పడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు.మాంచెస్టర్ లోని ఫాలోఫీల్డ్ కు చెందిన జాస్మిన్ డేవిడ్ ఇప్పుడు నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) ట్రయల్ తర్వాత సెప్టెంబర్ లో తన 25వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి ఎదురుచూస్తున్నారు.

క్రిస్టీ ఎన్‌హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ రీసెర్చ్ (ఎన్ఐహెచ్ఆర్) .

మాంచెస్టర్ క్లినికల్ రీసెర్చ్ ఫెసిలిటీ (సీఆర్ఎఫ్)లో ఆమె రెండేళ్లుగా అటెజోలిజుమాబ్ అనే ఇమ్యునోథెరపీ డ్రగ్ ని ఇంట్రావీనస్ గా తీసుకుంటున్నారు.

దీనిని ప్రతి మూడు వారాలకు ఒకసారి ఆమెకు ఇస్తున్నారు వైద్యులు. """/" / దీనిపై డేవిడ్ స్పందిస్తూ.

తన ప్రారంభ క్యాన్సర్ చికిత్స తర్వాత తాను 15 నెలలు పాటు దానిని పూర్తిగా మరిచిపోయాని చెప్పారు.

కానీ క్యాన్సర్ తిరగబెట్టిందని ఆమె తెలిపారు.అయితే ఓ రోజున క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొనాల్సిందిగా కోరారని.

అయితే అది పనిచేస్తుందో లేదో తనకు తెలియదని డేవిడ్ అన్నారు.కానీ ఇతరులకు సహాయం చేయడానికి, భవిష్యత్తు తరాల కోసం తన శరీరాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పారు.

క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న కొత్తలో తలనొప్పి, శరీర ఉష్ణోగ్రతలు పెరగడం వంటి దుష్ప్రభావాలు ఎదుర్కొన్నాని తెలిపారు.

క్రిస్మస్ రోజు కూడా తాను ఆసుపత్రిలో వున్నానని.కానీ అప్పుడు తన శరీరం చికిత్సకు బాగా స్పందించేదని జాస్మిన్ చెప్పారు.

కాగా.ఆరోగ్యంగా వున్న రోజుల్లో జాస్మిన్ వృద్ధుల సంరక్షణ గృహంలో క్లినికల్ లీడ్‌గా వ్యవహరించారు.

జీవితం సజావుగా సాగుతున్న దశలో 2017లో ఆమె తన చనుమొన పైన ఓ గడ్డను గుర్తించారు.

వైద్యులు చేసిన పరీక్షలో జాస్మిన్ కు ట్రిపుల్ నెగటివ్ రొమ్ము క్యాన్సర్ వున్నట్లు తేలింది.

దీంతో ఏప్రిల్ 2018లో ఆరు నెలల పాటు కీమోథెరపీ, మాస్టెక్టమీ చేయించుకుంది.ఆ తర్వాత 15 సైకిల్స్ రేడియోథెరపీ చేయించుకుంది.

దీంతో ఆమె క్యాన్సర్ నుంచి కోలుకుంది.కానీ అక్టోబర్ 2019లో జాస్మిన్ కు క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టింది.

అంతేకాదు.స్కానింగ్ లో ఆమె శరీరంలోని పలు ప్రాంతాల్లో గాయాలు కనిపించాయి.

ఇదే సమయంలో క్యాన్సర్ కణాలు ఊపిరితిత్తులు, లింఫ్ గ్రంథులు, ఛాతీ ఎముకల వరకు వ్యాపించాయి.

వ్యాధి తీవ్రతను బట్టి జాస్మిన్ ఏడాదికి మించి బతకలేరని వైద్యులు తెలిపారు.సరిగ్గా ఇదే సమయంలో డేవిడ్ కు ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్నానని చెప్పింది.

ట్రీట్‌మెంట్ మధ్యలో వుండగానే భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియక ఫిబ్రవరి 2020లో తన 50వ పుట్టినరోజు జరుపుకున్నాను.

రెండున్నరేళ్ల క్రితం ఇదే ముగింపు అనుకున్నానని.కానీ ఇప్పుడు పునర్జన్మ పొందినట్లు భావిస్తున్నానని డేవిడ్ తెలిపారు.

దళితులపై నారా భువనేశ్వరి అసభ్య పదజాలం.. ఫేక్ కాదని నిర్ధారణ..!!