ఒహియో సెనేట్ సీటుపై వివేక్ రామస్వామి కన్ను? .. ట్రంప్‌తో మంతనాలు అందుకేనా?

గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్ ఎన్నికైన సంగతి తెలిసిందే.

దీంతో ఆయన అప్పటి వరకు ప్రాతినిథ్యం వహించిన ఒహియో యూఎస్ సెనేట్(ఒహియో యూఎస్ సెనేట్) సీటు ఖాళీ అయ్యింది.

ఈ స్థానానికి త్వరలో ఎన్నిక జరగనుండగా.భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి(vivek Ramaswamy) ఆసక్తి చూపుతున్నట్లుగా అసోసియేటెడ్ ప్రెస్‌ నివేదించింది.

సిన్సినాటికి చెందిన వివేక్ రామస్వామి 2026లో ఒహియో గవర్నర్‌ పదవిలో బరిలో దిగాలని చూస్తున్నారు.

ట్రంప్ (Trump)అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఫెడరల్ ప్రభుత్వ ఖర్చులు, నిబంధనలు, సిబ్బందిని తగ్గించే విభాగానికి ఎలాన్ మస్క్‌ - వివేక్ రామస్వామిలను(Elon Musk , Vivek Ramaswamy) సారథులుగా నియమించిన సంగతి తెలిసిందే.

అయితే ఇటీవల .ఒహియో సెనేట్ సీటును భర్తీ చేయడంపై పలుమార్లు ట్రంప్‌తో రామస్వామి చర్చలు జరిపినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి.

2022లో సెనేట్‌కు ఎన్నికైన వాన్స్ వారసుడిని ఒహియో గవర్నర్ , రిపబ్లికన్ నేత మైక్ డివైన్(Mike DeWine) నియమిస్తారు.

అయితే సోమవారం రిపబ్లికన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన వాన్స్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.డివైన్ సెనేటర్‌గా నియమించే వ్యక్తి డిసెంబర్ 2026 వరకు పనిచేస్తారు.

వారు నవంబర్ 2026లో మిగిలిన పదవీ కాలానికి మళ్లీ పోటీ చేయాల్సి ఉంటుంది.

"""/" / కాగా.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం పోటీపడిన వారిలో వివేక్ రామస్వామి కూడా ఒకరు.

ఈ ఏడాది జనవరిలో అయోవా కాకస్‌లలో నాల్గవ స్థానంలో నిలిచిన ఆయన రేసు నుంచి తప్పుకున్నారు.

అనుకున్న స్థాయిలో ప్రజల నుంచి మద్ధతు లభించకపోవడంతో ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నానని.

డొనాల్డ్ ట్రంప్‌కే తన మద్ధతని వివేక్ ప్రకటించారు. """/" / అమెరికన్ మీడియాలో వచ్చిన ఊహాగానాలను నిజం చేస్తూ ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలకు ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ హెడ్స్‌గా ఈ ఇద్దరు కుబేరులను నియమించారు.జో బైడెన్ సారథ్యంలోని ప్రభుత్వం వృథా ఖర్చులను చేస్తోందని.

ప్రభుత్వ వ్యవస్థల్లో సంస్కరణలే లక్ష్యంగా ఈ డిపార్ట్‌మెంట్‌ను రూపొందించామని అధికారులు తెలిపారు.వివేక్, ఎలాన్ మస్క్‌లు దుబారా ఖర్చులను తగ్గించడంలో ప్రభుత్వానికి సాయం చేస్తారని ట్రంప్ సైతం ఆకాంక్షించారు.

ఈ విదేశీ మహిళకు బుద్ధి లేదు.. కిరణ్ బేడీ వత్తాసు పలకడమే దారుణం?