వివేక్ రామస్వామి పదవిపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
TeluguStop.com
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్( US President Donald Trump ) ప్రమాణ స్వీకారం ముగిసింది.
అతిరథ మహారథుల సమక్షంలో ఆయన రాజ్యాంగ నిబంధనలను అనుసరించి ప్రమాణ స్వీకారం పూర్తి చేసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ క్రమంలో ట్రంప్ కీలక ప్రకటన చేశారు.భారత సంతతికి చెందిన బిలియనీర్ వివేక్ రామస్వామి( Vivek Ramaswamy ) ఇకపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో( Elon Musk ) కలిసి ప్రభుత్వ సమర్ధత విభాగానికి (DOGE) సహ అధిపతిగా ఉండరని ట్రంప్ తెలిపారు.
అమెరికన్ మీడియా కథనాల ప్రకారం వివేక్ రామస్వామి వచ్చే వారం ఒహియో గవర్నర్ పదవికి పోటీ చేయనున్నారట.
దీనిపై వివేక్ కూడా ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు.ప్రభుత్వ విభాగాలను క్రమబద్ధీకరించడంలో ఎలాన్ బృందం విజయం సాధిస్తుందని ఆయన ఆకాంక్షించారు.
ఒహియోలో( Ohio ) నా భవిష్యత్ ప్రణాళికల గురించి త్వరలోనే చెబుతానని.ట్రంప్ అమెరికాను మళ్లీ గొప్పగా మార్చేందుకు చేసే ప్రయత్నంలో మా సహకారం ఉంటుందని వివేక్ రామస్వామి స్పష్టం చేశారు.
అయితే వివేక్ రామస్వామిని DOGE బాధ్యతల నుంచి తొలగించాలని మస్క్ ఇటీవలే కోరినట్లుగా ఓ కథనం చక్కర్లు కొడుతోంది.
అయితే హెచ్ 1 బీ వీసాపై( H-1B Visa ) వివేక్ చేసిన వ్యాఖ్యలు రిపబ్లికన్‌లలో కలకలం రేపాయి.
"""/" /
ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఫెడరల్ ప్రభుత్వ ఖర్చులు, నిబంధనలు, సిబ్బందిని తగ్గించే విభాగానికి ఎలాన్ మస్క్ - వివేక్ రామస్వామిలను సారథులుగా నియమించిన సంగతి తెలిసిందే.
అయితే ఇటీవల .ఒహియో సెనేట్ సీటును భర్తీ చేయడంపై పలుమార్లు ట్రంప్‌తో రామస్వామి చర్చలు జరిపినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి.
"""/" /
కాగా.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం పోటీపడిన వారిలో వివేక్ రామస్వామి కూడా ఒకరు.
ఈ ఏడాది జనవరిలో అయోవా కాకస్‌లలో నాల్గవ స్థానంలో నిలిచిన ఆయన రేసు నుంచి తప్పుకున్నారు.
అనుకున్న స్థాయిలో ప్రజల నుంచి మద్ధతు లభించకపోవడంతో ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నానని.
డొనాల్డ్ ట్రంప్‌కే తన మద్ధతని వివేక్ ప్రకటించారు.
ఈ సింపుల్ చిట్కా పాటిస్తే మీ ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు!