‘బలమైన ఫండమెంటల్స్’ వుంటే భవిష్యత్ భారతీయ స్టార్టప్‌లదే : ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త వినోద్ ఖోస్లా

ప్రపంచవ్యాప్తంగా నిధుల కొరత, లే ఆఫ్‌ల మధ్య భారతీయ స్టార్టప్‌లు( Indian Startups ) కష్టాలను ఎదుర్కొంటున్నాయన్నారు భారత సంతతికి చెందిన వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా( Venture Capitalist Vinod Khosla ) అన్నారు.

అయినప్పటికీ బలమైన పునాదులు వున్న కంపెనీలకు నిధులు అందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.అంతర్జాతీయ వార్తాసంస్థ బీబీసీతో ఇటీవల వినోద్ మాట్లాడుతూ.

ఈ కంపెనీలు చిన్న సంస్థలతో పోటీపడాల్సిన అవసరం లేదన్నారు.అందువల్ల తమ మూలధనాన్ని మరింత తెలివిగా ఉపయోగించుకోవచ్చని వినోద్ సూచించారు.

అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్‌వీబీ) పతనం తర్వాత వినోద్ ఖోస్లా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఈ బ్యాంక్‌లో భారతీయ స్టార్టప్‌లకు చెందిన దాదాపు 1 బిలియన్ డాలర్ల విలువైన డిపాజిట్లు వున్నాయి.

"""/" / ఖోస్లాతో పాటు ఛాట్‌జీపీటీ డెవలపర్ అయిన ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్‌లు( Sam Altman ) ఎస్‌వీబీ పతనం తర్వాత స్టార్టప్‌లకు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు.

తాము వందకు పైగా పోర్ట్‌ఫోలియో కంపెనీలతో మాట్లాడుతున్నామని ఖోస్లా అన్నారు.వారి ప్రధాన అవసరాలపై దృష్టి పెట్టామని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు స్టార్టప్‌ల ద్వారా జీడీపీ వృద్ధిని పొందే అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ దీర్ఘకాలంగా నిలుస్తుందని ఖోస్లా ఆకాంక్షించారు.

ప్రభుత్వ విధానాలు కూడా ఈ సంస్థలకు ప్రయోజనాలను అందించడంలో సహాయపడతాయని వినోద్ అభిప్రాయపడ్డారు.

"""/" / ఇదిలావుండగా.ఢిల్లీలో జన్మించిన వినోద్ ఖోస్లా.

అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో వెంచర్ క్యాపిటల్ సంస్థ ఖోస్లా వెంచర్‌ను( Khosla Venture ) స్థాపించారు.

వ్యాపారంలో దూసుకుపోతున్న ఆయన ఫోర్బ్స్ ఇండో అమెరికన్ బిలియనీర్‌ల జాబితాలోనూ నిలిచారు.ఆయన ఆస్తుల విలువ 2.

9 బిలియన్ డాలర్లు.బయోమెడిసిన్, రోబోటిక్స్ వంటి సాంకేతికతల అభివృద్ధిలో ఖోస్లా వెంచర్స్ పెట్టుబడులు పెడుతోంది.

వ్యాపారాల్లో బిజీగా వున్నప్పటికీ.తన జన్మభూమిలోనూ సామాజిక సేవల్లో చురుగ్గా పాల్గొంటున్నారు వినోద్.

దేశాన్ని వణికించిన కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ సిలిండర్లతో పాటు వైద్య సేవల కోసం 10 మిలియన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నారు ఖోస్లా.

నా కూతురికి నేనిచ్చే పెద్ద బహుమతి అదే.. రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!