బ్రిటన్‌లో కేర్‌టేకర్‌లపై వేధింపులు .. భారత సంతతి జర్నలిస్ట్ అండర్ కవర్ ఆపరేషన్‌తో వెలుగులోకి
TeluguStop.com
మెరుగైన అవకాశాల కోసం కావొచ్చు, జీవనోపాధి కోసం కావొచ్చు.ఎంతోమంది భారతీయులు విదేశాలకు వలస వెళ్తున్నారు.
కానీ అక్కడికి వెళ్లాక కానీ అసలు వాస్తవాలు తెలియవు.వెట్టి చాకిరీ, తగినంత వేతనం ఇవ్వకపోవడం, వేధింపులు వంటివి ఎదుర్కోవాల్సి వస్తోంది.
తాజాగా ఈశాన్య ఇంగ్లాండ్‌లోని వృద్ధుల సంరక్షణ గృహానికి కేర్ అసిస్టెంట్‌గా వెళ్లిన కేరళకు చెందిన భారత సంతతి రిపోర్టర్ బాలకృష్ణన్ బాలగోపాల్( Reporter Balakrishnan Balagopal ) అనే జర్నలిస్ట్ అక్కడి పరిస్ధితులను కనుగొన్నారు.
ఓ వార్తా సంస్థ కోసం ఆయన అండర్ కవర్ ఆపరేషన్ చేసి సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు.
సదరు కేర్ టేకర్ల నుంచి భారతీయ రిక్రూట్‌మెంట్ సంస్థలు వేల పౌండ్లను వసూలు చేసి సుదీర్ఘ కాంట్రాక్ట్‌లను కుదుర్చుకుంటున్నాయి.
ఒకవేళ మధ్యలోనే ఉద్యోగాన్ని వదిలేస్తే భారీ జరిమానాలను విధిస్తున్నట్లు బాలగోపాల్ గుర్తించారు.దేశంలోని హెల్త్ కేర్ సెక్టార్‌లో సిబ్బంది కొరతను అధిగమించడానికి గతేడాది 1,40,000 మందికి బ్రిటన్ వీసాలను మంజూరు చేసింది.
ఇందులో ఒక్క భారత్ నుంచే 39,000 మంది యూకేకు వెళ్లారు.విదేశీ సంరక్షకుల జీవితాలను తాను లోతుగా పరిశోధించినప్పుడు దోపిడీ, అప్పులు, కుటుంబం నుంచి విడిపోవడం వంటి విషయాలను గుర్తించినట్లు బాలగోపాల్ తెలిపారు.
"""/" /
నైపుణ్యం కలిగిన వర్కర్ వీసా కోసం అర్హత వున్న విదేశాల నుంచి నర్సులు, హెల్త్ కేర్ వర్కర్స్ .
యజమాని ద్వారా స్పాన్సర్ చేయబడాలని ఆయన వెల్లడించారు.అప్పుడు సిద్ధాంతపరంగా, వారు ఉద్యోగాలను మార్చుకోగలుగుతారని.
కానీ పరిమిత కాల వ్యవధిలో కార్మికులను దోపిడి చేసేలా యజమానులకు వీలు కలుగుతుందని బాలగోపాల్ చెప్పారు.
ఇమ్మిగ్రేషన్ విధానాలపై యూకే ప్రభుత్వానికి సలహా ఇచ్చే స్వతంత్ర సంస్థ ‘‘మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ (ఎంఏసీ) గత వారం విడుదల చేసిన తన వార్షిక నివేదికలో దేశంలోని (యూకే) సామాజిక సంరక్షణ రంగంలో దోపిడి గురించి అనేక విషయాలను తెలిపింది.
ఆ వెంటనే అంతర్జాతీయ వార్తాసంస్ధ బీబీసీ కోసం బాలగోపాల్ ‘‘కేర్ వర్కర్స్ అండర్ ప్రెజర్’’ ( Care Workers Under Pressure ) పేరిట తన ఆపరేషన్ విషయాలను బయటపెట్టడం గమనార్హం.
"""/" /
సామాజిక సంరక్షణ రంగంలో కార్మికులపై జరుగుతున్న దోపిడీని అణిచివేసేందుకు ప్రభుత్వానికి ఎంఏసీ అనేక సిఫార్సులను చేసింది.
అత్యల్ప వేతనం పొందే వలస కార్మికులపై అధికంగా ఆధారపడటాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగా ఈ రంగంలో అధిక వేతనాలు వుండేలా చూడాలని ఎంఏసీ ప్రభుత్వానికి సూచించింది.
క్యా క్యాచ్ హే మాక్స్… అదుర్స్ అంటున్న క్రికెట్ బ్రదర్స్!