అమెరికాలో ఇల్లు కొన్న భారత సంతతి ట్రక్ డ్రైవర్ .. ఎంతో తెలుసా, నోరెళ్లబెడుతోన్న నెటిజన్లు

అమెరికాలో ఇల్లు కొన్న భారత సంతతి ట్రక్ డ్రైవర్ ఎంతో తెలుసా, నోరెళ్లబెడుతోన్న నెటిజన్లు

సొంత ఇంట్లో ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది.ఎవరి స్థోమతకు తగ్గట్టుగా చిన్నదో , పెద్దదో ఇల్లు ఉండాలని .

అమెరికాలో ఇల్లు కొన్న భారత సంతతి ట్రక్ డ్రైవర్ ఎంతో తెలుసా, నోరెళ్లబెడుతోన్న నెటిజన్లు

అందులో ఫలానా సౌకర్యం కల్పించాలని కలలు కంటూ ఉంటారు.ఎంతో శ్రమించి పైసా పైసా కూడబెట్టి సొంతింటి కలను సాకారం చేసుకుంటూ ఉంటారు.

అమెరికాలో ఇల్లు కొన్న భారత సంతతి ట్రక్ డ్రైవర్ ఎంతో తెలుసా, నోరెళ్లబెడుతోన్న నెటిజన్లు

అయితే పెరిగిపోయిన ధరలతో పేద, మధ్యతరగతి వర్గాలకు సొంతింటి కల అందని ద్రాక్షగా మారుతోంది.

ఒక్క భారతదేశంలోనే కాదు.ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్ధితి.

అలాంటిది ఒక భారతీయుడు దేశం కానీ దేశమైన అమెరికాకు వలస వెళ్లి అక్కడ ఇల్లు కొనడమంటే మామూలు విషయం కాదు.

ప్రస్తుతం అమెరికా ఆర్ధిక పరిస్ధితి ఏమాత్రం బాలేదు.అధిక ధరలు, వడ్డీ రేట్లను పరిగణనలోనికి తీసుకుంటే .

అద్దెకు ఉండే వ్యక్తులకు అక్కడ సొంతిల్లు అనేది పగటి కల లాంటిదని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఒక భారతీయ ట్రక్ డ్రైవర్ (Indian-origin Truck Driver)దానిని సాధించి చూపించాడు.

AvgIndian Observer అనే ఎక్స్ హ్యాండిల్‌లో దీనికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. """/" / ఈ ట్వీట్‌లో సదరు ట్రక్ డ్రైవర్ కొత్తగా కొనుగోలు చేసిన ఇంటి ముందు నిలబడి ఉన్నాడు.

పట్టణ శివార్లలో ఉన్న ఈ ఇల్లు ఐదు బెడ్‌రూమ్‌లను కలిగి ఉండగా.భారతీయ కరెన్సీలో దీని విలువ అక్షరాలా రూ.

2 కోట్లు.నిజానికి ఈ వార్త ఇప్పటిది కాదు.

గతేడాది ట్రావెల్ వ్లాగర్ ఒకరు ఈ విషయాన్ని పంచుకున్నారు.అయితే ఇంటర్నెట్‌లో ఇది మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చి , వైరల్ అవుతోంది.

దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.అమెరికాలో గృహ నిర్మాణంపై పెద్ద చర్చకు దిగిన వారు.

భారతదేశంలో కంటే యూఎస్‌లో ఇంటిని కొనుగోలు చేయడం సులభమా అని ప్రశ్నిస్తున్నారు.అలాగే అమెరికాలో సగటు ట్రక్ డ్రైవర్ ఈ స్థాయిలో సంపాదిస్తున్నాడా అని నోరెళ్లబెడుతున్నారు.

అమెరికాలో చెక్క ఇళ్లు అని.భారతదేశంలో మాదిరిగా ఇటుకలు, కాంక్రీట్‌‌తో నిర్మించినవి కాదని .

అవి కేవలం 4 నుంచి 5 నెలల్లో నిర్మితమవుతాయని ఓ యూజర్ రాసుకొచ్చాడు.

అమెరికాలో ఎక్కువ భూమి, తక్కువ ప్రజలు ఉన్నారని అతను తెలిపారు.అయితే ఆ ఇల్లు కొన్న ట్రక్ డ్రైవర్ పేరు, తదితర వివరాలను అందులో పంచుకోలేదు.

అబ్బాయిలతో మతగురువు అసభ్య ప్రవర్తన.. వీడియో బయటపడటంతో నెటిజన్లు ఆగ్రహం!