బ్రిటన్ హోంమంత్రిగా మరోసారి సుయెల్లా బ్రేవర్‌మాన్.. రిషి సునాక్ సంచలన నిర్ణయం

అనూహ్య పరిణామాల మధ్య బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు భారత సంతతికి చెందిన రిషి సునాక్.

మంగళవారం బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ చార్లెస్ IIIను కలిశారు రిషి.ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రిషిని కింగ్ చార్లెస్ కోరారు.

రాజముద్ర లభించిన వెంటనే బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టారు.అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.

దేశాన్ని గాడిలో పెట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని స్పష్టం చేశారు.పార్టీ, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని రిషి సునాక్ తెలిపారు.

మరోవైపు.ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తన కేబినెట్ సహచరులను ఎంపిక చేసే పనిని ప్రారంభించారు రిషి సునాక్.

దీనిలో భాగంగా లిజ్ ట్రస్ మంత్రి మండలిలోని కొందరికి ఉద్వాసన పలికి, సమర్ధులైన వారికి మరోసారి పట్టం కట్టారు.

వీటన్నింటిలోకి బ్రిటన్ హోంమంత్రిగా సుయెల్లా బ్రేవర్‌మాన్‌ను తిరిగి నియమించడం వివాదాస్పదమైంది.అయితే హోంమంత్రిగా ఆమె పనితీరు, వైఖరి తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

వీసా పరిమితి ముగిసినప్పటికీ భారతీయులు బ్రిటన్‌ను వీడటం లేదని.మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్‌నర్‌షిప్ (ఎంఎంపీ) ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని బ్రేవర్‌మాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

"""/"/ అలాగే ఇండియా- యూకేల మధ్య చర్చల దశలో వున్న ప్రతిపాదిత స్వేచ్చా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై వీసా సంబంధిత రిజర్వేషన్లపైనా సుయెల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దీనిపై భారత్ ధీటుగా బదులిచ్చింది.ఇది ముగిసిన కొన్నాళ్లకే సుయెల్లా బ్రేవర్‌మాన్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

అధికారిక కార్యక్రమం కోసం వ్యక్తిగత ఈమెయిల్ ఇచ్చినందుకు మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

అయితే ప్రస్తుతం యూకేలో చోటు చేసుకున్న పరిస్ధితుల నేపథ్యంలో రోజులు గడవకముందే సుయెల్లా బ్రేవర్‌మాన్ మరోసారి బ్రిటన్ హోంమంత్రిగా పగ్గాలు అందుకోనున్నారు.

సూసేకి పాటకు వధువు క్యూట్ డ్యాన్స్.. వీడియో వైరల్..