స్విట్జర్లాండ్‌లో గ్రాడ్యుయేషన్ డే .. లెహంగాలో వచ్చిన భారతీయ విద్యార్ధిని
TeluguStop.com
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడా మన సంస్కృతిని విస్తరిస్తున్నారు.
తాజాగా స్విట్జర్లాండ్‌లో( Switzerland ) జరిగిన స్నాతకోత్సవ వేడుకకు లెహంగాతో( Lehenga ) హాజరై టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా నిలిచారు ఓ భారత సంతతి విద్యార్ధిని.
భారత మూలాలున్న లక్ష్మీ కుమారి( Lakshmi Kumari ) యూనివర్సిటీ ఆఫ్ బాసెల్( University Of Basel ) నుంచి జర్మన్ లాంగ్వేజ్‌లో లా స్టడీస్ చేస్తున్నారు.
ఈ క్రమంలో తన గ్రాడ్యుయేషన్ డే( Graduation Day ) సందర్భంగా భారతీయ సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొనాలని డిసైడ్ అయ్యారు .
దీనిలో భాగంగా ప్రముఖ డిజైనర్ అనీషా శెట్టి డిజైన్ చేసిన లెహంగాను ఫ్యాబిలిషియస్ ఫ్యాషన్ అనే వెబ్‌సైట్ నుంచి ఆర్డర్ చేసింది.
"""/" /
స్విట్జర్లాండ్‌లో ప్రస్తుతం గడ్డకట్టే వాతావరణం ఉన్నప్పటికీ ఆమె లెహంగా ధరించడం విశేషం.
ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో లెహంగాలో స్నాతకోత్సవానికి హాజరైన ఫోటోలను ఆమె పంచుకున్నారు.బయట మైనస్ డిగ్రీల వాతావరణం, మంచుతో నిండిన పరిస్ధితులు ఉన్నప్పటికీ లెహంగా ధరించే విషయంలో రాజీ పడేది లేదని లక్ష్మీకుమారి పోస్ట్ పెట్టారు.
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.నెటిజన్లు ఆమె వస్త్రధారణపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
దక్షిణాఫ్రికాలో చాలా మంది భారతీయ విద్యార్ధులు గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా భారతీయ దుస్తులను ధరిస్తారని.
కానీ మీరు చాలా అందంగా ఉన్నారని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. """/" /
స్నాతకోత్సవం ముగిసిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.
తన విజయాలను జరుపుకోవడానికి, తనకు స్థానికంగా లేని భాషలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినందుకు గాను గ్రాడ్యుయేషన్ డే వేడుకలో లెహంగా ధరించాలని నిర్ణయించుకున్నట్లు లక్ష్మీకుమారి చెప్పారు.
లెహంగా ధరించడంపై తన క్లాస్‌మేట్స్, ప్రొఫెసర్‌ల స్పందన గురించి ఆమె మాట్లాడుతూ.వారంతా దీనిని ఇష్టపడతారని, తనకు అండగా నిలిచినట్లు వెల్లడించారు.
అంతేకాదు.బాలీవుడ్ సినిమాలు రిలీజైనప్పటికీ.
స్విట్జర్లాండ్‌లో లెహంగా ధరించిన వారిని చూడటం అరుదు అని లక్ష్మీ కుమారి పేర్కొన్నారు.
అమరావతి పై కీలక నిర్ణయాలు.. ఇక పరుగులే పరుగులు