దోపిడి దొంగల బీభత్సం.. అమెరికాలో భారత సంతతి స్టోర్ ఉద్యోగి దారుణ హత్య

అమెరికాలో( America ) భారత సంతతి వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు.జార్జియా రాష్ట్రంలోని ఓ స్టోర్‌లో( Store ) ఈ ఘటన జరిగింది.

సాయుధులైన ఇద్దరు యువకులు స్టోర్‌లో దొంగతనానికి యత్నించారు.ఈ క్రమంలో అక్కడే క్లర్క్‌గా పనిచేస్తున్న 36 ఏళ్ల భారత సంతతి వ్యక్తిని వారు కాల్చి చంపారు.

మృతుడిని మన్‌దీప్ సింగ్‌గా( Mandeep Singh ) గుర్తించారు.ఇతను రెన్స్ కన్వీనియ్స్ స్టోర్‌లో( Wrens Convenience Store ) క్లర్క్‌గా పనిచేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో జూన్ 28న రెన్స్ నగరంలో ఇద్దరు బాలుర చేతిలో మన్‌దీప్ హత్యకు గురయ్యాడు.

ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ఆగస్టా క్రానికల్ వార్తాపత్రిక గత వారం నివేదించింది.

"""/" / రెన్స్ పోలీస్ చీఫ్ జాన్ మేనార్డ్( John Maynard ) తెలిపిన వివరాల ప్రకారం.

అగస్టా నగరానికి( Augusta ) చెందిన సింగ్ సదరు కన్వీనియన్స్ స్టోర్‌లో ఉద్యోగంలో చేరి నెల కూడా కాలేదు.

ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.రంగంలోకి దిగిన పోలీసులు నిందితులైన ఇద్దరు 15 ఏళ్ల బాలురను అరెస్ట్ చేశారు.

మన్‌దీప్ సింగ్ మృతదేహాన్ని జార్జియా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ ల్యాబ్‌కు తరలిస్తున్నట్లు జెఫెర్సన్ కౌంటీ కరోనర్ కార్యాలయం తెలిపింది.

ఈ విపత్కర పరిస్ధితుల్లో బాధితుడి తల్లి, భార్యకు అండగా నిలిచేందుకు గాను GoFundMe పేజీలో నిధుల సేకరణను ప్రారంభించారు.

దీని ద్వారా సమకూరే మొత్తాన్ని అంత్యక్రియల ఖర్చులు, ఇతర వ్యయాల కోసం మన్‌దీప్ సింగ్ కుటుంబానికి అందించనున్నారు.

"""/" / ఇకపోతే.ఈ ఏడాది మే నెలలోనూ అమెరికాలో దోపిడి దొంగల చేతిలో భారత సంతతి విద్యార్ధి దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే.

ఫిలడెల్ఫియాలో ఈ ఘటన జరిగింది.మృతుడిని జూడ్ చాకోగా గుర్తించారు.

విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా.గుర్తు తెలియని దుండగులు అతనిని కాల్చి చంపినట్లు ఖలీజ్ టైమ్స్ నివేదించింది.

బాధితుడి తల్లిదండ్రులు కేరళలోని కొల్లాం జిల్లా నుంచి సుమారు 30 ఏళ్ల క్రితం యూఎస్‌కి వలస వచ్చారని మీడియా పేర్కొంది.

జూడ్ చాకో చదువుకుంటూనే మరో వైపు పార్ట్‌టైమ్ జాబ్ కూడా చేస్తున్నాడు.దోపిడి సమయంలో ఇద్దరు దుండగులు అతనిపై దాడి చేశారని మీడియా తెలిపింది.

రోజుకొక‌ ఉసిరికాయ తింటే ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయా..?