సింగపూర్ : భారత సంతతి మంత్రిపై అవినీతి ఆరోపణలు .. విచారణ, ఎవరీ ఈశ్వరన్..?
TeluguStop.com
అవినీతి ఆరోపణల నేపథ్యంలో భారత సంతతికి చెందిన సీనియర్ మంత్రి ఎస్ ఈశ్వరన్‌ను( S Iswaran ) సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించారు సింగపూర్ ప్రధాన మంత్రి లీ సీన్ లూంగ్.
ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.రవాణా శాఖ మంత్రి ఈశ్వరన్‌తో పాటు ఇతర వ్యక్తులను సీపీఐబీ విచారించాల్సి వుంటుందని ప్రధాని ప్రత్యేక ప్రకటనలో తెలిపారు.
ఈ క్రమంలో విచారణ పూర్తయ్యే వరకు సెలవు తీసుకోవాలని ఈశ్వరన్‌ను ఆదేశించారు లీ.
ఆయన విధులకు దూరంగా వుంటున్న నేపథ్యంలో సీనియర్ మంత్రి చీ హాంగ్ టాట్ రవాణా శాఖ తాత్కాలిక మంత్రిగా వ్యవహరిస్తారని ఛానెల్ న్యూస్ ఏషియా నివేదించింది.
బ్యూరో బయటపెట్టిన కేసుకు సంబంధించి గత బుధవారం సీపీఐబీ డైరెక్టర్ తనకు సమాచారం అందించారని లీ( Lee Hsien Loong ) చెప్పారు.
అధికారిక దర్యాప్తును ప్రారంభించేందుకు ఆయన ప్రధాని లీ అనుమతిని కోరారు.ప్రధానమంత్రి కార్యాలయం ఆధీనంలో వున్న యాంటీ గ్రాఫ్ట్ ఏజెన్సీకి డెనిస్ టాంగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
జూలై 6న సీపీఐబీ డైరెక్టర్‌కి ఆయన తన అనుమతిని ఇచ్చారు.ఆ తర్వాత జూలై 11న అధికారిక దర్యాప్తు ప్రారంభించిందని ప్రధాని తెలిపారు.
"""/" /
అటు సీపీఐబీలో తన ప్రకటనలో వాస్తవాలు, సత్యాన్ని స్థాపించడానికి , చట్టబద్ధమైన పాలనను సమర్ధించడానికి దృఢమైన సంకల్పంతో కేసును దర్యాప్తు చేస్తామని పేర్కొంది.
సీపీఐబీ ద్వారా ఒక మంత్రిని విచారిస్తున్నందున మరిన్ని వివరాలు చెప్పలేకపోతున్నామని తెలిపింది.సీపీఐబీ( CPIB ) అన్ని కేసులను నిర్బయంగా , ఎలాంటి దయ లేకుండా దర్యాప్తు చేస్తుందని స్పష్టం చేసింది.
అవినీతి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడదని తెలిపింది. """/" /
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సింగపూర్‌ను పాలిస్తున్న పీపుల్స్ యాక్షన్ పార్టీలో (పీఏపీ) ఈశ్వరన్ పార్లమెంట్ సభ్యుడు.
ఆయన 1997లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు.2006లో ఈశ్వరన్ మంత్రిగా నియమితులయ్యారు.
రవాణా మంత్రిగా, కోవిడ్ సంక్షోభం తర్వాత సింగపూర్‌ను ఎయిర్ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఈశ్వరన్ కీలకపాత్ర పోషించారు.
అలాగే సింగపూర్ వాణిజ్య సంబంధాల ఇన్‌ఛార్జ్ మంత్రిగానూ వ్యవహరిస్తున్నారు.అలాంటి వ్యక్తి విచారణను ఎదుర్కొంటూ వుండటంతో అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సింగపూర్‌లో 2025లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎన్నికలు ముందుగానే నిర్వహించవచ్చు.
1965లో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి సింగపూర్‌ను పీఏపీ పరిపాలిస్తోంది.
ఆమెతో మళ్లీ నటించాలని ఉంది… మనసులో కోరిక బయటపెట్టిన సూర్య.. ఆ కండిషన్ తప్పనిసరి?