యూకేలో పలు మోసాలకు పాల్పడుతూ అడ్డంగా బుక్కైన లేడీ ఎన్నారై..

భారతీయ సంతతికి చెందిన నరీందర్ కౌర్ అలియాస్ నినా టియారా( Narinder Kaur ) అనే మహిళ అనేక మోసాలకు పాల్పడింది.

ఆ నేరాలకు యూకే కోర్టు( UK Court ) ఆమెను దోషిగా నిర్ధారించింది.

గ్లౌసెస్టర్ క్రౌన్ కోర్టులో నాలుగు నెలల పాటు కొనసాగిన కోర్టు విచారణలో మోసం, నేరస్థ ఆస్తులను కలిగి ఉండటం, బదిలీ చేయడం, న్యాయ మార్గాన్ని తప్పుదారి పట్టించడం వంటి 26 నేరాలకు కౌర్‌ దోషిగా నిర్ధారణ అయ్యింది.

సీరియల్ షాప్‌లిఫ్టర్‌గా( Serial Shoplifter ) ఈమెకు కోర్టు పేరు కూడా ఇచ్చింది అంటే ఎన్నిసార్లు షాప్ లో దొంగతనం చేసిందో అర్థం చేసుకోవచ్చు.

"""/" / ఈమె యూకే అంతటా ప్రయాణించడం, హై స్ట్రీట్ షాపుల నుండి వస్తువులను దొంగిలించడం, నిజాయితీగా వాటిపై వాపసులను క్లెయిమ్ చేయడం ఒక జాబు లాగా చేసింది.

2015, జులై నుంచి 2019, ఫిబ్రవరి మధ్య కౌర్ వివిధ రిటైలర్‌లను వెయ్యి సార్లు మోసం చేసిందని లాయర్ టీమ్‌ నిరూపించగలిగింది.

ఆమె ఇంటిలో పోలీసులు సోదాలు చేసినప్పుడు, సుమారు 150,000 పౌండ్ల క్యాష్, దొంగిలించిన వస్తువులు కనుగొనబడ్డాయి.

ఈ మోసపూరిత కార్యకలాపాల ద్వారా ఆమె అర మిలియన్ పౌండ్లకు పైగా సంపాదించింది.

"""/" / కౌర్ తన పేరును చట్టబద్ధంగా మార్చుకుంది.రెండవ గుర్తింపులో కొత్త బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డ్‌లను తెరిచి ఇన్ని రోజులపాటు తప్పించుకుంది.

బెయిల్ షరతులను సడలించడానికి ఆమె కోర్టుకు అబద్ధం చెప్పి తప్పుడు డాక్యుమెంట్స్‌ సమర్పించింది.

కౌర్‌పై కేసును నిరూపించడానికి CPS ఆర్థిక డేటా, రిటైల్ రికార్డులు, సాక్షుల సాక్ష్యం, సీసీటీవీ ఫుటేజీలను ఉపయోగించింది.

ఇవన్నీ పరిగణలోకి తీసుకొని కోర్టు ఆమెను దోషిగా తేల్చింది.

మేడ్చల్ జిల్లాలో షాకింగ్ యాక్సిడెంట్.. వీడియో వైరల్..