భారత సంతతి సైన్స్ టీచర్‌కి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి పురస్కారం..!!

తన అత్యుత్తమ బోధనా ప్రతిభతో ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ ఓ భారత సంతతి ఉపాధ్యాయురాలు ఏకంగా ఆ దేశ ప్రధాన మంత్రి పురస్కారాన్ని అందుకున్నారు.

వివరాల్లోకి వెళితే.మెల్‌బోర్న్‌ నగరానికి చెందిన వీణా నాయర్.

వ్యూ బ్యాంక్ కాలేజ్ హెడ్ ఆఫ్ టెక్నాలజీగా, STEAM ప్రాజెక్ట్ లీడర్‌గా వ్యవహరిస్తున్నారు.

‘‘ STEAM ’’ పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించవచ్చో ప్రాక్టీకల్‌గా తెలియజేసినందుకు ఆమెను ఈ అవార్డ్‌కు ఎంపిక చేశారు.

తాను ప్రధానమంత్రి పురస్కారానికి ఎంపికైనందుకు వీణా నాయర్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పాఠశాలకు, సహోద్యోగులకు, తన విద్యార్ధులకు, కుటుంబ సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

చాలామందికి STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) అంటే తెలుసునని, కానీ STEAM గురించి తెలియదని .

ఇందులో ‘A’ అంటే ఆర్ట్స్‌ అని వీణా నాయర్ చెప్పారు.ఇది విద్యార్ధులకు సృజనాత్మకతను అందిస్తుందని ఆమె అన్నారు.

ఇకపోతే .STEAM అంశంలో ప్రముఖ విద్యావేత్తగా వీణా నాయర్‌కు భారత్, యూఏఈ, ఆస్ట్రేలియాలలో మంచి గుర్తింపు వుంది.

అలాగే సైన్స్ సంబంధిత సబ్జెక్ట్‌లను బోధించడంలో 20 ఏళ్లకు పైగా అనుభవం వుంది.

యూనివర్సిటీలో ఇంజనీరింగ్, టెక్నాలజీ సబ్జెక్ట్‌లను అభ్యసించే విద్యార్ధుల సంఖ్య పెరగడానికి వీణా నాయర్ కృషి చేశారు.

ఆమె భారత్‌లోని ముంబైలో తన అధ్యాపక వృత్తిని ప్రారంభించారు.ఈ సమయంలో చిన్న పాఠశాలలకు కంప్యూటర్లను అందించి.

విద్యార్ధులు కోడింగ్ ఎలా చేయాలో నేర్పించారు. """/"/ అంతేకాకుండా ముంబైలోని చిన్న పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోసం STEAM వర్క్ షాపులను నిర్వహించే ఆస్ట్రేలియన్ ఉపాధ్యాయుల బృందానికి వీణా నాయర్ నాయకత్వం వహించారు.

విద్యా రంగంలో సేవలకు గాను ఆమెను పలు అవార్డులు, రివార్డులు వరించాయి.2018లో డిజైన్ అండ్ టెక్నాలజీ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియాచే ఎడ్యుకేటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును వీణా నాయర్ అందుకున్నారు.

శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి లోని..ఈ విషయాలు ప్రతి మహిళలోనూ ఉండాల్సిందే..!