ఓసీఐ కార్డ్ రద్దు.. భారత ప్రభుత్వంపై కోర్టుకెక్కిన ఎన్ఆర్ఐ ప్రొఫెసర్

ఓసీఐ కార్డ్ రద్దు భారత ప్రభుత్వంపై కోర్టుకెక్కిన ఎన్ఆర్ఐ ప్రొఫెసర్

తన ఓవర్సీస్ సిటిజన్‌ ఆఫ్ ఇండియా కార్డ్ (ఓసీఐ కార్డ్)ను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు స్వీడన్‌లోని భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ అశోక్ స్వైన్.

ఓసీఐ కార్డ్ రద్దు భారత ప్రభుత్వంపై కోర్టుకెక్కిన ఎన్ఆర్ఐ ప్రొఫెసర్

దీనిపై జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ విచారించారు.నాలుగు వారాల్లోగా ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఆమె కేంద్రాన్ని ఆదేశించారు.

ఓసీఐ కార్డ్ రద్దు భారత ప్రభుత్వంపై కోర్టుకెక్కిన ఎన్ఆర్ఐ ప్రొఫెసర్

అలాగే తదుపరి విచారణను 2023 ఫిబ్రవరికి వాయిదా వేశారు.ఓసీఐ కార్డ్ అనేది భారత సంతతికి చెందిన విదేశీ పౌరులకు మంజూరు చేస్తారు.

ఓసీఐ కార్డ్ వున్నవారికి భారతదేశంలో నివసించడానికి, పనిచేయడానికి వీలు కలుగుతుంది.స్వైన్.

స్వీడన్ ఉప్సల యూనివర్సిటీలో పీస్ అండ్ కన్‌ఫ్లిక్స్ట్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.అయితే భారత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసిన కొన్ని ప్రకటనల కారణంగా తన ఓసీఐ కార్డ్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో రద్దు చేశారని అశోక్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

తాను రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆయన చెబుతున్నారు.తాను విద్వేషపూరిత ప్రసంగాలు, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నానని చెప్పారని.

కానీ ఈ ఆరోపణలను రుజువు చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవని అశోక్ అంటున్నారు.

ఒక ప్రొఫెసర్‌గా ప్రభుత్వ పని విధానాలను చర్చించడం, విమర్శించడం తన పాత్ర అని ఆయన అన్నారు.

విద్యావేత్త అయినందున అశోక్.ప్రస్తుత ప్రభుత్వ విమానాలను విశ్లేషిస్తాడని , విమర్శిస్తాడని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుత పాలక వర్గ విధానాలను విమర్శించడం పౌరసత్వ చట్టం, 1955లోని సెక్షన్ 7 డీ(ఈ) ప్రకారం భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు కాదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

"""/"/ మరోవైపు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మొత్తం 1,24,99,395 మంది భారతీయులు వున్నట్లు ఇటీవల కేంద్రప్రభుత్వం వెల్లడించింది.

అలాగే ద్వంద్వ పౌరసత్వానికి సంబంధించి ప్రభుత్వం ఏ ప్రతిపాదనను పరిగణించడం లేదని లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానమిచ్చింది.

మరోపక్క ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు కోసం 2020లో 1,91,609 మంది విదేశీయులు దరఖాస్తు చేసుకున్నట్టు కేంద్రం పార్లమెంట్‌కు తెలియజేసింది.

అందుకే పవన్ కళ్యాణ్ కు నేను ఓటు వేయలేదు… కోర్టు హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!