భారత సంతతి వ్యక్తి అరుదైన ఘనత

మేధోసంపత్తి.విషయపరిజ్ఞానం.

ఆలోచనా ఫటిమ ఇవన్నీ భారతీయులకి తరతరాల నుంచీ వస్తున్న విలువైన సంపదలు.ఈ నాడు ఉన్నతమైన భవిష్యత్తు కోసం దేశం కాని దేశం విడిచి తమ ప్రతిభని విదేశాలలో చాటి చూపిస్తూ అంచెలంచెలుగా ఎంతో మంది భారతీయులు విదేశాలలో భారతీయుల ప్రతిభని చాటి చెప్తున్నారు.

ఈ క్రమంలోనే అమెరికాలాంటి అగ్ర రాజ్యంలో వెలుగు చూసిన ఎన్నో ప్రయోగాలు కానీ మరెన్నో అధునాతన సాంకేతికత లో కానీ భారతీయుల కష్టం దాగి ఉందని చెప్పడంలో సందేహం లేదు.

అయితే Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఈ మధ్యకాలంలోనే ఎన్నో ఏళ్ల క్రితమే అమెరికా వెళ్ళిపోయి అక్కడ పౌరసత్వం పొంది భారత సంతతి వ్యక్తులుగా ఉంటున్న వారు ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటుతున్నారు.

వివిధ శాఖలలో భారతీయులని కూడా తీసుకోవడం మన ప్రతిభకి గుర్తింపుగా చెప్పుకోవచ్చు.అయితే తాజాగా భారత సంతతి వ్యక్తి అయిన చందర్ మోహన్ అమెరికాలో పెద్ద శాస్త్రవేత్తగా పేరొందారు.

ఈయన పేగు వ్యాధి(ఐబీడీ)కి దారితీస్తున్న 50 ప్రొటీన్‌ బయోమేకర్స్‌ను కనుగొన్నారు.దీనివల్ల అతిసారం, కడుపు తిప్పడం, బరువు తగ్గడం వంటి వ్యాధులకు కారణాలు తెలుసుకోవచ్చునని యూనివర్సిటీ ఆఫ్‌ హోస్టన్‌లో ప్రొఫెసరుగా ఉన్న చందర్‌ తెలిపారు.

వాస్తవానికి ఈ వ్యాధిని గుర్తించాలంటే ఎండోస్కోపీ విధానంలో జీర్ణవ్యవస్థ దగ్గర భాగాలను సేకరించి బయాప్సీకి పంపుతారు.

కానీ అలాంటి ఇబ్బందికరమైన పరీక్షలు లేకుండానే రుగ్మత గురించి తెలుసుకోవచ్చునని అంటున్నారు.

కన్నడ బిగ్ బాస్ విన్నర్ కూడా రైతుబిడ్డనే.. ఎంత ఫ్రైజ్ మనీ గెలిచాడంటే?