బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు నామినేట్ అయిన భారత సంతతి వ్యక్తి .. ఎవరీ క్రిష్ రావల్?
TeluguStop.com
లేబర్ పార్టీ డయాస్పోరా గ్రూప్( Labor Party Diaspora Group ), లేబర్ ఇండియన్స్‌కు నాయకత్వం వహించే లండన్‌కు చెందిన ఒక భారత సంతతి ప్రొఫెషనల్‌ను హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో ఎంపీగా నామినేట్ చేశారు బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్.
( British Prime Minister Keir Starmer ) మొత్తం 30 మంది ఎంపీలను నామినేట్ చేయగా వారిలో భారత సంతతి ప్రొఫెషనల్ కూడా ఒకరు.
ప్రధాని నామినేషన్‌లను యూకే రాజు కింగ్ చార్లెస్ III ఆమోదించారు.లీడర్‌షిప్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటర్ ఫెయిత్ కోహెషన్ సేవలు అందించినందుకు గాను క్వీన్ ఎలిజబెత్ II ద్వారా 2018లో ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ ఎంపైర్ (ఓబీఈ)ని అందుకున్నారు క్రిష్ రావల్.
"""/" /
ఫెయిత్ ఇన్ లీడర్‌షిప్ వ్యవస్ధాపక డైరెక్టర్‌గా , ఇంటర్ ఫెయిత్ సంబంధాలను పెంపొందించడానికి రావల్ కృషి చేస్తున్నారు.
ఇప్పుడు స్టార్మర్ మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్యూ గ్రే( Sue Gray ), శ్రీలంక హెరిటేజ్ మాజీ లేబర్ షాడో మినిస్టర్ తంగం డెబోన్నైర్‌లతో కలిసి యూకే పార్లమెంట్ ఎగువ సభలోని లేబర్ బెంచ్‌లలో లైఫ్ పీర్‌గా చేరనున్నారు.
స్వతంత్ర హౌస్ ఆఫ్ లార్డ్స్ అపాయింట్‌మెంట్స్ కమీషన్ (హెచ్‌వోఎల్ఏసీ) ఈ నామినేషన్లను ప్రధాన మంత్రి అధికారికంగా రాజుకు సిఫార్సు చేసే ముందు వాటిని పరిశీలిస్తుంది.
"""/" /
బ్రిటీష్ పార్లమెంట్ జారీ చేసిన చట్టపరమైన పత్రాలు, సమన్లు, చక్రవర్తి జారీ చేసిన లెటర్స్, పేటెంట్ ద్వారా కొత్త సభ్యులు హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో తమ సీట్లలో కూర్చోవడానికి, ఓటు వేయడానికి లైఫ్ పీరేజ్‌ను తీసుకొచ్చారు.
టోరీల ఆధిపత్యం ఉన్న హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో వారితో సమానంగా బలాన్ని పొందే ప్రయత్నాలలో భాగంగా లేబర్ పార్టీ 30 మందిని నామినేట్ చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కాగా ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ నేత కెమి బాడెనోచ్ ఆరుగురిని, లిబరల్ డెమొక్రాట్‌లు ఇద్దరిని నామినేట్ చేసిన తర్వాత హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో పాలక లేబర్ పార్టీలో 217 మంది, టోరీలు 279, లిబ్ బెమ్స్ 80 మంది పీఆర్‌లు ఉంటారని అంచనా.
నిజానికి హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో ఏ పార్టీకి చెందని వారు ఉంటారు.
Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters