భారత సంతతి ప్రొఫెసర్ ఖాతాను బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన ట్విట్టర్... ‘‘ట్విట్టర్ ఫైల్స్ 2’’లో వెలుగులోకి..!!
TeluguStop.com
అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన భారత సంతతి ప్రొఫెసర్ జే భట్టాచార్య ఖాతాను ట్విట్టర్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది.
కోవిడ్, లాక్‌డౌన్‌లు పిల్లలకు హాని కలిగిస్తాయని ఆయన పేర్కొన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్గత పత్రాలు వెల్లడించాయి.
జర్నలిస్ట్ బారీ వీస్ విడుదల చేసిన రెండో విడత ‘‘ట్విట్టర్ ఫైల్స్’’లో ఈ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్రెండింగ్ చేయకుండా నిరోధించిన ట్వీట్ కేసులను వెలికి తీసింది.
ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను వీస్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు.ఇందులో జే భట్టాచార్య అకౌంట్ కూడా వుంది.
దీనిని ‘ట్రెండ్స్ బ్లాక్‌లిస్ట్’లో వుంచినట్లుగా గుర్తించారు.ట్విట్టర్ అతనిని రహస్యంగా ట్రెండ్స్ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిందని, ఇది ఆయన ట్వీట్లు ట్రెండింగ్ కాకుండా నిరోధించడమేనని బారీ వీస్ పేర్కొన్నారు.
ట్విట్టర్ ఉద్యోగులు బ్లాక్‌లిస్ట్‌లను రూపొందిస్తున్నారని, అలాగే ట్రెండింగ్ టాపిక్‌లను కూడా పరిమితం చేస్తారని తమ దర్యాప్తులో తేలిందన్నారు.
ఈ సీక్రెట్ గ్రూప్‌లో ట్విట్టర్ లీగల్, పాలసీ అండ్ ట్రస్ట్ హెడ్ (విజయ గద్దె), గ్లోబల్ హెడ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ (యోయెల్ రోత్), సీఈవోలు జాక్ డోర్సే, పరాగ్ అగర్వాల్ తదితరులు వున్నారని బారీ వీస్ తెలిపారు.
"""/"/
అయితే బారీ వీస్ ఆరోపణలను ట్విట్టర్ కొట్టిపారేసింది.తాము ఎప్పుడూ అలాంటి పనులు చేయలేదని తెలిపింది.
మరోవైపు బారీ వీస్ దర్యాప్తు వివరాలు బయటకు వచ్చిన తర్వాత ప్రొఫెసర్ జే భట్టాచార్య స్పందించారు.
ట్విట్టర్ తనను బ్లాక్‌లిస్ట్‌లో వుంచిందని వింటే తట్టుకోలేకపోతున్నానని, భావోద్వేగాలను నియంత్రించుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే కోవిడ్ పాలసీపై చర్చ జరగకుండా అణచివేయడంలో ప్రభుత్వం ఏ మేరకు పాత్ర పోషించిందనే దానిపై తనకు అనుమానాలు వున్నాయని జే భట్టాచార్య పేర్కొన్నారు.
ఆ హీరోలతో నటించాలని ఉందని చెప్పిన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి.. ఏమైందంటే?