కౌన్సిలర్ ముసుగులో చీకటి యవ్వారాలు.. అమెరికాలో భారత సంతతి నేతపై కేసు

అమెరికాలో ( America)భారత సంతతికి చెందిన రాజకీయ నాయకుడిపై గ్యాంబ్లింగ్ కేసు(gambling Case) నమోదు కావడం కలకలం రేపింది.

న్యూయార్క్ శివార్లలోని ప్రాస్పెక్ట్ పార్క్ మున్సిపల్ కౌన్సిలర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆనంద్ షాపై(Anand Shah) గ్యాంబ్లింగ్ అభియోగాలు వచ్చాయి.

గ్యాంబ్లింగ్ సహా మనీలాండరింగ్ నేరాలకు పాల్పడిన 39 మంది వ్యక్తుల్లో ఆనంద్ ఒకరని న్యూజెర్సీ అటార్నీ జనరల్ మాథ్యూ ప్లాట్కిన్ ( న్యూజెర్సీ అటార్నీ జనరల్ మాథ్యూ ప్లాట్కిన్ )వివరించారు.

ఆనంద్‌తో పాటు ఫ్లోరిడాకు చెందిన మరో భారత సంతతి వ్యక్తి సమీర్ ఎస్ నాదకర్ణిపైనా అభియోగాలు నమోదు చేసినట్లు అటార్నీ కార్యాలయం తెలిపింది.

అమెరికాలోని అత్యంత ప్రమాదకరమైన లూచీస్ క్రైమ్ ఫ్యామిలీ అనే మాఫియా గ్రూప్‌తో కలిసి ఆనంద్ పోకర్ గేమ్‌లు, గ్యాంబ్లింగ్ (Anand Poker Games, Gambling)నిర్వహిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు.

ఆన్‌లైన్ స్పోర్ట్స్ బుక్‌లో పలు క్రీడలకు సంబంధించిన టోర్నమెంట్‌లపై బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారని అటార్నీ కార్యాలయం వెల్లడించింది.

ఇందులో దాదాపు 3 మిలియన్ డాలర్లకు వరకు బెట్టింగ్స్ ఉంటాయని తెలిపింది.ఆనంద్ షా తొలుత ఒకసారి కౌన్సిలర్‌గా విధులు నిర్వహించి.

ప్రస్తుతం రెండోసారి ఆ పదవిలో కొనసాగుతున్నారు.అలాగే ఆర్ధికాభివృద్ధి, బీమా వంటి బాధ్యతలను కూడా నిర్వహించినట్లుగా అటార్నీ కార్యాలయం వెల్లడించింది.

"""/" / కాగా.కొద్దిరోజుల క్రితం భారత సంతతికి చెందిన న్యాయమూర్తిపై అమెరికాలో అవినీతి ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది.

ఫోర్ట్ బెండ్ కౌంటీకి జడ్జిగా(judge For Fort Bend County) వ్యవహరిస్తోన్న కేపీ జార్జ్‌పై మోసం, ప్రచార ఆర్ధిక నివేదికను తప్పుగా చూపించడం సహా రెండు మనీలాండరింగ్ ఆరోపణలపై గత శుక్రవారం అరెస్ట్ చేశారు.

2018 నుంచి కౌంటీ జడ్జిగా పనిచేసి 2022లో తిరిగి ఎన్నికైన డెమొక్రాటిక్ పార్టీకి చెందిన జార్జ్‌ను తొలుత అరెస్ట్ చేసి, అనంతరం కౌంటీ జైలులో ఉంచి 20 వేల డాలర్ల పూచీకత్తుపై బెయిల్‌పై విడుదల చేశారు.

ఆ అభియోగాలపై ఆయనపై గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే తనపై వచ్చిన ఆరోపణలను కేపీ జార్జ్ ఖండించారు.