అమెరికా: పిల్లలను కారులో లాక్‌ చేసి షాపింగ్‌కి.. భారతీయ జంట అరెస్ట్

తమ ఇద్దరు పిల్లలను కారులో వదిలిపెట్టి షాపింగ్‌కి వెళ్లినందుకు భారత సంతతి జంట కటకటాలపాలైంది.

వివరాల్లోకి వెళితే.గీతా లక్ష్మీ ధనుంజయన్, జయచంద్రన్ పల్లవరాజన్ అనే దంపతులు అమెరికాలో స్థిరపడ్డారు.

ఈ క్రమంలో వీరు జార్జియాలోని స్మిర్నాలో గత వారం కిరణా సామాగ్రి కొనుగోలు చేసేందుకు వెళ్లారు.

అయితే ఆ సమయంలో నిద్రపోతున్న వారి 9 ఏళ్ల కుమారుడిని, 3 ఏళ్ల కుమార్తెను కారులోనే లాక్‌చేసి దంపతులిద్దరూ షాపింగ్ చేశారు.

అయితే షాపింగ్ పూర్తయిన తర్వాత బిల్లింగ్ కౌంటర్ వద్ద ఈ దంపతులు కంగారుగా కనిపించారు.

దీనిపై అక్కడి సిబ్బంది ప్రశ్నించగా.తమ పిల్లలను కారులో వదిలేసి వచ్చామని, త్వరగా తమను పంపించాలని కోరారు.

దీనికి ఖంగుతిన్న సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

అయితే కారులో ఆ కాసేపటికీ ఉష్ణోగ్రత 120 డిగ్రీలకు పైగా పెరిగిపోయింది.అనంతరం కారు కిటికీలు ఓపెన్ చేసిన పోలీసులు చిన్నారులను రక్షించారు.

అంతేకాదు పిల్లల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను పలు అభియోగాలు మోపి వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ సంఘటన మే 28 సాయంత్రం స్ప్రింగ్ రోడ్ 2500 బ్లాక్‌లోని కంబర్ ల్యాండ్ క్రాసింగ్ షాపింగ్ సెంటర్ వద్ద జరిగింది.

పోలీసులు చెబుతున్న దానిని బట్టి.దంపతులిద్దరూ తమ పిల్లలను నిస్సాన్ అల్టిమా కారులో కనీసం 20 నిమిషాల పాటు వదిలిపెట్టారు.

ఇంజిన్‌ను ఆఫ్ చేయడంతో పాటు .నాలుగు వైపులా వున్న డోర్స్ క్లోజ్ చేశారు.

దీనిపై జయచంద్రన్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.తాము షాపింగ్‌కి వచ్చేసరికి పిల్లలిద్దరూ నిద్రపోతున్నారని చెప్పారు.

అలాగే కారు లోపల చల్లగా వుండటంతో ఇంజిన్ ఆఫ్ చేశానని వెల్లడించారు.ఒకవేళ కారులో వేడిగా వున్నట్లయితే తన కుమారుడు ఫోన్ చేసేవాడని జయచంద్రన్ చెప్పాడు.

తాము ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పు చేయలేదని.తమ బిడ్డలను బాధపెట్టడం తమకు ఇష్టం లేదని పేర్కొన్నాడు.

మహేష్ బాబులో నమ్రతకు నచ్చని క్వాలిటీ అదేనా.. ఆ పని చేస్తే అస్సలు ఒప్పుకోదా?