దక్షిణాఫ్రికాకు తొలి భారతీయుల రాకను సెలబ్రేట్ చేసుకున్న ఎన్నారైలు..
TeluguStop.com
2023, నవంబర్ 16న గురువారం అనేక మంది భారతీయ సంతతికి చెందిన దక్షిణాఫ్రికా వాసులు 1860లో తమ పూర్వీకులు ఆ దేశానికి వచ్చిన రాకను సెలబ్రేట్ చేసుకున్నారు.
163 ఏళ్ల క్రితం ఒప్పంద కార్మికులుగా భారతీయులు దక్షిణాఫ్రికాకు వెళ్లారు.అయితే తాజాగా ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ 163వ వార్షికోత్సవాన్ని ఎన్నారైలు ఘనంగా జరుపుకున్నారు.
వారు తమ వారసత్వం, చరిత్రను గౌరవించే వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు.డర్బన్‌లోని( Durban ) 1860 హెరిటేజ్ సెంటర్‌లో బెల్ రింగింగ్ వేడుకతో ఈ యానివర్సిటీ సెలబ్రేషన్స్ ప్రారంభించారు.
1860, నవంబర్ 16న మొదటి ఓడ ప్రయాణంలో బయటపడిన 342 మంది ఒప్పంద కార్మికులకు ప్రాతినిధ్యం వహించేలా గంటను మూడు, నాలుగు, రెండు సార్లు మోగించారు.
క్వాజులు-నాటల్ యూనివర్సిటీలోని గాంధీ-లుతులి సెంటర్ బోర్డు సభ్యుడు కిరు నైడూ( Kiru Naidoo ) మాట్లాడుతూ.
మార్గమధ్యంలో మరణించిన వారిని కూడా గుర్తుంచుకున్నామని, వారికి సరిగ్గా అంత్యక్రియలు నిర్వహించలేదని చెప్పారు.
తరువాతి దశాబ్దాలలో దక్షిణాఫ్రికాకు వచ్చిన ఒప్పంద కార్మికులందరినీ 1860 హెరిటేజ్ సెంటర్ సత్కరించిందన్నారు.
"""/" /
1860 హెరిటేజ్ సెంటర్ క్యూరేటర్ సెల్వన్ నాయుడు( Heritage Center Curator Selvan Naidu ) మాట్లాడుతూ, 1860, 1911 మధ్యకాలంలో 384 నౌకలపై వచ్చిన 1,52,184 మంది ఒప్పంద కార్మికుల ధైర్యం, దృఢత్వం, త్యాగానికి నివాళులు అర్పించారు.
ఎన్నారైల బృందం ఓడలలో వచ్చిన భారతీయులు స్థాపించిన నగరంలోని కొన్ని పురాతన మతపరమైన ప్రదేశాలను సందర్శించింది.
వీటిలో హజ్రత్ బాద్షా పీర్ మసీదు, ఇమ్మాన్యుయేల్ కేథడ్రల్, శ్రీ వైతినాథ ఈశ్వరర్ అలయం ఉమ్గేని రోడ్ టెంపుల్ ఉన్నాయి.
"""/" /
అంతిమ నివాళిగా డర్బన్ బీచ్‌లో వందలాది మంది ప్రజలు బంతి పువ్వులను సముద్రంలోకి విసిరారు.
వారిలో ఒకరు 100 సంవత్సరాల వయస్సు గల జేమ్స్ రాతిబార్.డర్బన్‌లోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ థెల్మా జాన్ డేవిడ్( General Dr.
Thelma John David ) కూడా పుష్ప సమర్పణలో పాల్గొన్నారు.వలస పాలనలో చెరుకు పొలాల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని కష్టపడి పనిచేసిన తమ తండ్రులు, తల్లులను స్మరించుకోవడం, గౌరవించడం, బాధ్యత వహించడం ఇది చారిత్రాత్మకమని థెల్మా జాన్ అన్నారు.
టమాటోను పచ్చిగా తినొచ్చా.. కచ్చితంగా తెలుసుకోండి!