హమాస్‌కు విద్యార్ధుల మద్ధతు .. కరెక్ట్ కాదన్న భారత సంతతి రచయిత సల్మాన్ రష్డీ

ఇజ్రాయెల్ - హమాస్( Israel-Hamas War ) యుద్ధం అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే.

ఇజ్రాయెల్, పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికన్ యూనివర్సిటీలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు అట్టుడుకుతున్నాయి.

దీంతో శాంతి భద్రతల సమస్యలు చోటు చేసుకుని ప్రభుత్వ యంత్రాంగానికి తలనొప్పులు తీసుకొస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పాలస్తీనాకు మద్ధతుగా నిలుస్తున్న వారిపై మండిపడ్డారు భారత సంతతి రచయిత సల్మాన్ రష్డీ.

జర్మన్ బ్రాడ్‌కాస్టర్ రండ్‌ఫంక్ బెర్లిన్ - బ్రాండెన్‌బర్గ్ హోస్ట్ చేసిన వోర్టే ఉండ్ వోర్టే (ప్లేసెస్ అండ్ వర్డ్స్ ) పోడ్‌కాస్ట్‌‌లో ఆయన పాల్గొన్నారు.

ప్రగతిశీల విద్యార్ధి ఉద్యమాల రాజకీయ ఒరవడి గురించి రష్డీ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇజ్రాయెల్ దౌత్యవేత్త డేవిడ్ సారంగ ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్ అవుతోంది.

"""/" / పాలస్తీనా( Palestine ) స్వతంత్ర దేశానికి చాలాకాలంగా మద్ధతిచ్చిన రష్డీ తన ప్రస్తుత భయాందోళనలను వివరించారు.

‘‘తన జీవితంలో చాలా వరకు పాలస్తీనా కోసం వాదించానని.బహుశా అది 1980 నుంచి కావొచ్చు.

పాలస్తీనా ఏర్పడినట్లయితే అది హమాస్‌ నేతృత్వంలో నడుస్తుంది.అంటే అది తాలిబన్ రాష్ట్రంగా మారి, ఇరాన్ క్లయింట్‌‌గా ఉంటుంది ’’ అని రష్డీ వ్యాఖ్యానించారు.

పశ్చిమ దేశాల్లోని ప్రగతిశీల ఉద్యమాలు నిజంగా మధ్యప్రాచ్యంలో తాలిబన్ లేదా అయతుల్లాల తరహాలో మరో పాలనను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాయా అని రష్డీ ప్రశ్నించారు.

"""/" / ప్రస్తుతం గాజాలో అమాయకుల మరణాల సంఖ్యను చూస్తే ఏ మనిషైనా బాధపడాల్సి వుంటుందన్నారు.

హమాస్ ఒక ఉగ్రవాద సంస్థ అన్న సల్మాన్ రష్డీ .యువత, ప్రగతిశీల విద్యార్ధి రాజకీయాలు ఓ ఫాసిస్ట్ ఉగ్రవాద గ్రూపుకు మద్ధతు ఇవ్వడం విచిత్రంగా ఉందని అభిప్రాయపడ్డారు.

గాజాలో మరణాలకు భావోద్వేగ ప్రతిస్పందన వుందన్న ఆయన కానీ అది సెమిటిజం వైపు కొన్నిసార్లు హమాస్‌కు మద్ధతుగా మారినప్పుడు సమస్యాత్మకమవుతుందన్నారు.

రష్డీ వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారితీశాయి.కాగా.

సల్మాన్ రష్డీ 1988లో రచించిన ‘‘ ది సాటానిక్ వెర్సెస్( The Satanic Verses )’’ కోట్లాది మంది ముస్లింలను , ఇస్లాంను, మొహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వుందని ఆయనపై ముస్లిం దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

కానీ ఈ విషయాన్ని ఇరాన్ మాత్రం సీరియస్‌గా పరిగణించింది.నాటి ఆ దేశ అధినాయకుడు అయతోల్లా రుహోల్లా ఖొమేనీ .

సల్మాన్ ‌ను హతమార్చాల్సిందిగా ఫత్వా జారీ చేశారు.దీంతో సల్మాన్ రష్డీ కొన్నేళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

దశాబ్ధాలు గడవటంతో, సల్మాన్ ప్రాణాలకు ముప్పు ముగిసిపోయిందని.ఫత్వా కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని భావిస్తోన్న తరుణంలో రష్డీపై గతేడాది జరిగిన దాడి యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.

ఆమె సైన్ చేసినప్పుడే గేమ్ ఛేంజర్ డిజాస్టర్.. కమల్ ఆర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు!