హార్వార్డ్ బిజినెస్ స్కూల్‌ డీన్‌గా పదవీ విరమణ చేయనున్న నితిన్ నోహ్రియా

హార్వార్డ్ బిజినెస్ స్కూల్‌కి డీన్‌గా వ్యవహరిస్తున్న భారత సంతతి వ్యక్తి నితిన్ నోహ్రియా వచ్చే ఏడాది జూన్‌లో పదవి విరమణ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఆయన ఈ బిజినెస్ స్కూల్‌‌కు పదవ డీన్‌గా 10 ఏళ్లపాటు సేవలు అందించినట్లయ్యింది.

అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్ధులు మరియు పూర్వ విద్యార్ధులకు రాసిన సందేశంలో నితిన్ మాట్లాడుతూ.

హార్వార్డ్ బిజినెస్ స్కూల్‌లో నాయకత్వం మారడానికి సమయం ఆసన్నమైందన్నారు.ఫైవ్-ఐ ప్రాధాన్యతలపై అద్భుతమైన పురోగతిని సాధించడంలో ఈ పదేళ్లు ఉపయోగపడ్డాయన్నారు.

తన పదవీకాలంలో స్కూల్ ముఖ్య లక్ష్యణంగా ఉన్న ఆవిష్కరణ, మేధో ఆశయం, అంతర్జాతీయికరణ, చేరిక మరియు సమైక్యతలపై దృష్టి పెట్టామన్నారు.

హార్వార్డ్ బిజినెస్ స్కూల్‌కు డీన్‌గా పనిచేయడం గర్వంగా ఉందని.ఇందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటానన్నారు.

1988లో హార్వార్డ్‌ బిజినెస్ స్కూల్ ఫ్యాకల్టీలో చేరిన ఆయన ముంబైలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు.

ఆ తరవాత ఎంఐటీకి చెందిన స్లోన్ స్కూల్‌ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి పీహచ్‌డీ పట్టా పొందారు.

నితిన్ నోహ్రియా డజనుకు పైగా పుస్తకాలను రచించారు.2018లో ఆయన రాసిన హార్వార్డ్ బిజినెస్ రివ్యూ వ్యాసం ‘హౌ సీఈవోస్ మేనేజ్ టైమ్’’కు ప్రతిష్టాత్మక మెకిన్సే అవార్డు వరించింది.

"""/"/ తన సందేశంలో 2007 నుంచి 2018 వరకు హార్వార్డ్ బిజినెస్ స్కూల్ అధ్యక్షుడిగా పనిచేసిన డ్రూ ఫౌస్ట్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

నోహ్రియా డీన్‌గా ఉన్న కాలంలో కీలక రంగాలలో గణనీయమైన పరివర్తన జరిగింది.హెచ్‌బీఎస్ కొత్తగా ప్రవేశపెట్టిన ఫీల్డ్ ఇమ్మర్సన్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ మెథడ్ అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది.

అలాగే 2014లో ప్రారంభమైన హార్వార్డ్ బిజినెస్ స్కూల్ ఆన్‌లైన్.డిజిటల్ లెర్నింగ్‌ ఫ్లాట్‌ఫాంగా సేవలందిస్తోంది.

రాజ్యాంగ సవరణలు చేసింది కాంగ్రెస్సే..: ఈటల