న్యూజెర్సీ స్టేట్ సెనేట్‌కు ఎన్నికైన భారత సంతతి నేత .. మూడోసారి గెలుపు, ఎవరీ విన్ గోపాల్ ..?
TeluguStop.com
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు వలస వెళ్లిన భారతీయులు అక్కడ అన్ని రంగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే అమెరికన్ టెక్ దిగ్గజ సంస్థలకు పలువురు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారు.ఇక రాజకీయాల సంగతి సరేసరి.
అక్కడ కీలక పదవుల్లో మనవారే వున్నారు.స్వయంగా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్( Kamala Harris ).
భారత మూలాలకు చెందినవారు కావడం మనందరికీ గర్వకారణం.వీరు అమెరికన్ రాజకీయాల్లో పాతుకుపోయి వ్యవస్థలను శాసిస్తున్నారు.
తాజాగా భారతీయ అమెరికన్ నేత విన్ గోపాల్ న్యూజెర్సీ స్టేట్ సెనేట్‌కు మూడోసారి ఎన్నికయ్యారు.
38 ఏళ్ల ఈ డెమొక్రాట్ సెనేటర్ మంగళవారం న్యూజెర్సీలోని 11వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లో తన సమీప రిపబ్లికన్ పార్టీ ప్రత్యర్ధి స్టీవ్ డ్నిస్ట్రియన్‌ను ఓడించారు.
పోలింగ్‌లో గోపాల్‌కు దాదాపు 60 శాతం ఓట్లు వచ్చాయి.విన్ గోపాల్( Vin Gopal ) ప్రస్తుతం న్యూజెర్సీ స్టేట్ సెనేట్‌లో అతి పిన్న వయస్కుడైన సభ్యుడిగా, రాష్ట్ర చరిత్రలో సెనేట్‌కు ఎన్నికైన తొలి దక్షిణాసియా వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు.
అమెరికాలోని దాదాపు 37 రాష్ట్రాల్లో వివిధ ఎన్నికలు జరిగాయ.ఇందులో న్యూజెర్సీ.
స్టేట్ సెనేట్, అసెంబ్లీలను కలిగింది.40 జిల్లాల నుంచి 120 మంది సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ప్రతి జిల్లాకు సెనేట్‌లో ఒకరు, అసెంబ్లీలో ఇద్దరు వరుసగా నాలుగు, రెండేళ్ల పదవీకాలాన్ని కలిగి వుంటారు.
"""/" /
నవంబర్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 120 స్థానాలు బ్యాలెట్‌లో వున్నాయి.
రిపబ్లికన్ వైపు మొగ్గు చూపే 11వ జిల్లాపై వారు ప్రత్యేకంగా దృష్టిపెట్టారు.ఆఫ్‌షోర్ విండ్, పాఠశాలల్లోని ఎల్‌జీబీటీక్యూ సమస్యలపై రిపబ్లికన్లు ప్రచారం చేశారు.
తాజాగా గోపాల్ గెలిచిన స్థానం రిపబ్లికన్లు గట్టిగా గురి పెట్టిన లక్ష్యాలలో ఒకటి.
అక్టోబర్ వరకు డెమొక్రాట్లు 3.4 మిలియన్ల విరాళాలు సేకరించగా.
3.5 మిలియన్లు వెచ్చించారు.
రిపబ్లికన్లు 4,60,339 మిలియన్లు సేకరించి 4,44,970 మిలియన్లు ఖర్చు చేశారు.అనేక బయటి సమూహాలు కూడా ఎన్నికల యుద్ధంలో డబ్బును కుమ్మరించాయని విశ్లేషకులు అంటున్నారు.
"""/" /
గోపాల్ 2017లో తొలిసారిగా సెనేట్‌కు ఎన్నికయ్యారు.తర్వాత 2021లో రెండోసారి విజయం సాధించారు.
గోపాల్( Vin Gopal ) ప్రస్తుతం సెనేట్ ఎడ్యుకేషన్ కమిటీకి అధ్యక్షుడిగా.సెనేట్ మెజారిటీ కాన్ఫరెన్స్ లీడర్‌గా వ్యవహరిస్తున్నారు.
గతంలో సెనేట్ మిలిటరీ, వెటరన్స్ అఫైర్స్ కమిటీకి ఛైర్‌గానూ పనిచేశారు.సెనేట్ గవర్నమెంట్, టూరిజం అండ్ హిస్టారిక్ ప్రిజర్వేషన్ కమిటీకి వైస్ ఛైర్‌గా.
హెల్త్ , మానవ సేవలు, సీనియర్ సిటిజన్స్ కమిటీలో సభ్యుడిగానూ సేవలందించారు.
యూఎస్ ఆర్మీలోని ట్రాన్స్‌జెండర్స్‌పై ట్రంప్ సంచలన నిర్ణయం?