సింగపూర్ అధ్యక్ష ఎన్నికల బరిలో భారత సంతతి మంత్రి..!!

సింగపూర్ అధ్యక్ష ఎన్నికల బరిలో భారత సంతతి మంత్రి!!

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడ అత్యున్నత స్థానాలకు చేరుకుంటున్నారు.

సింగపూర్ అధ్యక్ష ఎన్నికల బరిలో భారత సంతతి మంత్రి!!

డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు ఇలా అన్ని రంగాల్లోనూ మంచి హోదాల్లో వున్నారు.

సింగపూర్ అధ్యక్ష ఎన్నికల బరిలో భారత సంతతి మంత్రి!!

ఇక ఆయా దేశాల రాజకీయాల్లోనూ భారతీయులు కీలకపాత్ర పోషిస్తున్నారు.అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాలలో అభ్యర్ధుల గెలుపొటములను నిర్దేశించే స్థాయికి మనోళ్లు చేరుకుంటున్నారు.

ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్( Vice President Kamalaharis ), యూకే ప్రధాని రిషి సునాక్‌లు( Rishi Sunak ) భారత మూలాలున్న వారు కావడం మనందరికీ గర్వకారణం.

తాజాగా.సింగపూర్‌ ( Singapore )అధ్యక్ష ఎన్నికల బరిలో భారత సంతతి వ్యక్తి పోటీపడుతున్నారు.

థర్మన్ షణ్ముగరత్నం( Thurman Shanmugaratnam ) అనే సీనియర్ మంత్రి తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు గురువారం ప్రకటించి అందరికీ షాకిచ్చారు.

1960ల నుంచి సింగపూర్‌ను పాలిస్తున్న పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ)కి తాను రాజీనామా చేస్తున్నానని, రాజకీయాలతో పాటు ప్రభుత్వంలో వున్న అన్ని పదవుల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు తన నిర్ణయాన్ని సింగపూర్ ప్రధాని లీ సియన్ లూంగ్‌కు తెలియజేశారు.

మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ (మాస్), జీఐసీ డిప్యూటీ ఛైర్మన్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు ఇంటర్నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్మన్, మంత్రి తదితర హోదాల్లో షణ్ముగం పనిచేస్తున్నారు.

"""/" / ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్( Economics Graduate ) అయిన థర్మన్ షణ్ముగం.

గతంలో సెంట్రల్ బ్యాంక్, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్‌లలో పనిచేశారు.తొలిసారిగా 2001లో జురాంగ్ జీఆర్‌సీ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు.

సింగపూర్‌లో చైనీస్ సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో స్థిరపడిన ఏరియాల్లో ఈ ప్రాంతం కూడా ఒకటి.

దేశ ఉప ప్రధానిగా, ఆర్ధిక, విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన థర్మన్.2019 మే నుంచి సీనియర్ మంత్రిగా పదోన్నతి పొందారు.

అలాగే సోషియల్ పాలసీలకు కో ఆర్టినేషన్ మినిస్టర్‌గా, ఆర్ధిక విధానాలపై ప్రధానికి సలహాదారుగా కూడా వ్యవహరించారు.

"""/" / సింగపూర్ ప్రజల కోరిక మేరకు తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు షణ్ముగం తెలిపారు.

తన జీవితంలో ఇది అత్యంత కఠినమైన నిర్ణయమన్న ఆయన.ఈ విషయంపై తన కుటుంబాన్ని , సన్నిహితులను సంప్రదించానని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం సింగపూర్ అధ్యక్షురాలిగా వున్న హాలీమా యాకూబ్ పదవీ కాలం ఈ ఏడాది సెప్టెంబర్‌ 13తో ముగియనుంది.

ఢిల్లీపై ఫారిన్ మహిళ లవ్.. నెగిటివ్ టాక్‌కు చెక్ పెడుతూ వైరల్ వీడియో!

ఢిల్లీపై ఫారిన్ మహిళ లవ్.. నెగిటివ్ టాక్‌కు చెక్ పెడుతూ వైరల్ వీడియో!