సింగపూర్ : అవినీతి ఆరోపణలు.. మంత్రి పదవికి భారత సంతతి నేత ఈశ్వరన్ రాజీనామా
TeluguStop.com
సింగపూర్‌లో భారత సంతతికి చెందిన రవాణా మంత్రి ఎస్ ఈశ్వరన్( S Iswaran ) తన పదవికి రాజీనామా చేశారు.
అవినీతి ఆరోపణల నేపథ్యంలో 27 అభియోగాలు నమోదు చేసిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
61 ఏళ్ల ఈశ్వరన్ .గతేడాది జూలై 11న అరెస్ట్ అయి.
8,00,000 బెయిల్‌పై విడుదలయ్యారు.ఆపై పాలక పీపుల్స్ యాక్షన్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీపీఐబీ) తనపై పలు అభియోగాలు నమోదు చేసిందని జనవరి 16న సింగపూర్ ప్రధాని లీ సియాన్ లూంగ్( Lee Hsien Loong )కు రాసిన రాజీనామా లేఖలో ఈశ్వరన్ పేర్కొన్నారు.
ఆ ఆరోపణలను తాను ఖండిస్తున్నానని, తన పేరును తొలగించడంపై దృష్టి సారిస్తానని చెప్పారు.
పరిస్థితుల దృష్ట్యా తాను మంత్రి పదవికి, పార్లమెంట్ సభ్యత్వానికి, పీఏపీకి రాజీనామా చేయడం సరైనదని నేను భావిస్తున్నానని రాశారు.
"""/" /
2023 జూలైలో విచారణ ప్రారంభించినప్పటి నుంచి సెలవుపై వున్న ఈశ్వరన్.
ఆ నెల నుంచి మంత్రిగా తన జీతం, ఎంపీగా అలవెన్సులను తిరిగి చెల్లించనున్నారు.
విచారణల కారణంగా మంత్రిగా , పార్లమెంట్ సభ్యునిగా నా బాధ్యతలను నిర్వర్తించలేనప్పుడు , వాటి నుంచి మనస్సాక్షిగా ప్రయోజనం పొందలేనప్పుడు ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నామని ఈశ్వరన్ తెలిపారు.
అంతేకాదు.ఒకవేళ తాను నిర్దోషిగా తేలినా తిరిగి ఇవ్వాల్సిందిగా కోరనని స్పష్టం చేశారు.
మరోవైపు.ఈశ్వరన్ స్థానంలో రవాణా మంత్రిగా ఛీ హాంగ్ టాట్( Chee Hong Tat ) నియమితులయ్యారు.
గురువారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రధాని కార్యాలయం తెలిపింది. """/" /
ఇకపోతే.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సింగపూర్‌ను పాలిస్తున్న పీపుల్స్ యాక్షన్ పార్టీలో (పీఏపీ) ఈశ్వరన్ పార్లమెంట్ సభ్యుడు.
ఆయన 1997లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు.2006లో ఈశ్వరన్ మంత్రిగా నియమితులయ్యారు.
రవాణా మంత్రిగా, కోవిడ్ సంక్షోభం తర్వాత సింగపూర్‌ను ఎయిర్ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఈశ్వరన్ కీలకపాత్ర పోషించారు.
అలాగే సింగపూర్ వాణిజ్య సంబంధాల ఇన్‌ఛార్జ్ మంత్రిగానూ వ్యవహరిస్తున్నారు.అలాంటి వ్యక్తి విచారణను ఎదుర్కొంటూ వుండటంతో అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సింగపూర్‌లో 2025లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎన్నికలు ముందుగానే నిర్వహించవచ్చు.
1965లో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి సింగపూర్‌ను పీఏపీ పరిపాలిస్తోంది.
Blackjack Variants & All Blacks Betting: A Practical Guide For NZ Punters